Lift Fell Down: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, తెగిపడిన లిఫ్ట్.. ముగ్గురు దుర్మరణం!-three wokers died when the lift fell from 70 metres height at ibrahimpatnam in ntr district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Three Wokers Died When The Lift Fell From 70 Metres Height At Ibrahimpatnam In Ntr District

Lift Fell Down: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, తెగిపడిన లిఫ్ట్.. ముగ్గురు దుర్మరణం!

HT Telugu Desk HT Telugu
Mar 18, 2023 11:07 AM IST

lift fell down in NTR District:ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ లో లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఊడి పడిన లిఫ్ట్
ఊడి పడిన లిఫ్ట్

Lift Fell Down at NTTPS at Vijayawada: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం వీటీపీఎస్ లోని లిఫ్ట్ తెగిపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎనిమిది మందితో పైకి వెళ్తున్న లిఫ్ట్ తీగ ఒక్కసారిగా తెగిపోవ‌డంతో అత్యంత వేగంగా కింద‌కు జారిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో స్పాట్ లో ఒక‌రు చ‌నిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు సమాచారం. మరికొందరికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. లిఫ్ట్ దాదాపు 70 మీటర్ల ఎత్తులో నుంచి తెగిపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొండ‌ప‌ల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం…

Road accident at Sri Sathya Sai district: ఏపీలోని సత్యసాయి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటోను బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆటో, బెలెరో చాలా వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా...మరొకొరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.

ఏం జరిగిందంటే…?

ధర్మవరం వైపు నుంచి బొలెరో(ఆటో) వాహనం బత్తలపల్లి వైపు వస్తుంది. బత్తలపల్లిలో ఓ ఆటో ప్రయాణికులను ఎక్కించుకొని ధర్మవరం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నాగులకట్ట వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఫలితంగా ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన మరో ముగ్గురికి స్థానిక ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

IPL_Entry_Point