Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి అప్‌డేట్స్ - జనవరి నెలలో జరిగే విశేష పర్వదినాలివే-these are the special festivals in tirumala in january 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి అప్‌డేట్స్ - జనవరి నెలలో జరిగే విశేష పర్వదినాలివే

Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి అప్‌డేట్స్ - జనవరి నెలలో జరిగే విశేష పర్వదినాలివే

Basani Shiva Kumar HT Telugu
Dec 29, 2024 11:18 AM IST

Tirumala Special Days 2025 : కొత్త ఏడాది జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఏ తేదీల్లో ఏ ఉత్సవాలను నిర్వహిస్తారో వివరించింది. జనవరి 9 నుంచి 29వ తేదీ వరకు వివిధ ఉత్సవాలు జరగనున్నాయి.

తిరుమల
తిరుమల (TTD)

జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తేదీల వారీగా పూర్తి వివరాలను వెల్లడించింది. జనవరి 9న చిన్న శాత్తుమొరతో ప్రారంభమై.. 29వ తేదీ శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాల వరకు విశేష పర్వదినాలను వెల్లడించింది.

yearly horoscope entry point

విశేష పర్వదినాలు..

జనవరి 09: చిన్న శాత్తుమొర.

జనవరి 10: వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.

జనవరి 11: వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్రస్నానం.

జనవరి 15: ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం.

జనవరి 17: తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

జనవరి 18: శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం.

జనవరి 19: పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.

జనవరి 20: శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

జనవరి 23: అధ్యాయనోత్సవాలు సమాప్తం.

జనవరి 24: తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు.

జనవరి 25: సర్వ ఏకాశశి జనవరి 26: గణతంత్ర దినోత్సవం.

జనవరి 27: మాస శివరాత్రి.

జనవరి 29: శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు.

డిసెంబర్ 30 నుంచి..

శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాల్లో.. 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు.. డిసెంబరు 30 నుంచి 2025 జ‌న‌వ‌రి 23వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా.. శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.

జీయంగార్లు గోష్ఠిగానం..

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను.. శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

Whats_app_banner