Chandrababu Rally: చంద్రబాబుకు అడుగడుగున జనం నీరాజనం, 15గంటలు సాగిన ప్రయాణం-the journey from rajamahendravaram to undavalli took 14 hours for chandrababu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  The Journey From Rajamahendravaram To Undavalli Took 14 Hours For Chandrababu Naidu

Chandrababu Rally: చంద్రబాబుకు అడుగడుగున జనం నీరాజనం, 15గంటలు సాగిన ప్రయాణం

Sarath chandra.B HT Telugu
Nov 01, 2023 06:24 AM IST

Chandrababu Rally: క్యాలెండర్‌లో నెల మారిపోయింది కానీ చంద్రబాబు కాన్వాయ్‌ మాత్రం అనుకున్న సమయానికి గమ్యానికి చేరలేదు. అడుగడుగున జనం బ్రహ్మరథం పలకడంతో మూడు గంటల ప్రయాణానికి దాదాపు 15గంటల సమయం పట్టింది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

Chandrababu Rally: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయటకు వచ్చిన చంద్రబాబు విజయవాడ చేరుకోడానికి దాదాపు 15 గంటల సమయం పట్టింది.

ట్రెండింగ్ వార్తలు

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకడానికి దారి పొడవున జనం పోటెత్తారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు జాతీయ రహదారిపై మూడు గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. జాతీయరహదారిపైకి జనం భారీగా తరలి రావడంతో చంద్రబాబు కాన్వాయ్‌ ముందుక కదలడం కష్టమైపోయింది.

ముందే రూట్ మ్యాప్ ఖరారు…

రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత లాలాచెరువు, మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి, జొన్నాడ సెంటర్, రావులపాలెం, సిద్ధాంతం, పెరవలి, తాడేపల్లి గూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్, కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. రాత్రి 9.20లోగా చంద్రబాబు ఉండవల్లి చేరుకునేలా రూట్ మ్యాప్‌ సిద్ధం చేశారు.అక్టోబర్‌ 31న బయలుదేరిన చంద్రబాబు నవంబర్ 1 ఉదయం ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.

14.30గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45గంటల ప్రాంతంలో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు.నిర్విరామంగా సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబునాయుడు అలసటకు గురయ్యారు. దారిపొడవునా ళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అర్థరాత్రి వేళ,తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెద్దఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.మహిళలు పెద్దఎత్తున ఇంటివద్దకు చేరుకుని గుమ్మడికాయల దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పట్టారు.

జాతీయ రహదారులపైకి పోటెత్తిన జనం
జాతీయ రహదారులపైకి పోటెత్తిన జనం

భారీగా తరలి వచ్చిన అభిమానులు

రాజమండ్రి దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు బయల్దేరిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లో చంద్రబాబును చూసేందుకు తరలివచ్చిన అభిమానులను రాజమండ్రి పోలీసులు కట్టడి చేసేందు ప్రయత్నించి విఫలమయ్యారు. దివాన్ చెరువు వద్ద వ్యూహాత్మకంగా చంద్రబాబు కాన్వాయ్ ని వదిలి మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు.

చంద్రబాబును అనుసరిస్తున్న పార్టీ నేతలవాహనాలను దివాన్ చెరువు వద్దే నిలిపివేశారు.సెంట్రల్ జైలు నుంచి బయలుదేరి 2గంటలైనా చంద్రబాబునాయుడు కాన్వాయ్ రాజమండ్రి దాటలేకపోయింది. కారులోపల నుండే ప్రజలకు నమస్కరిస్తూ జనసందోహం నడుమ చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగింది.

రాజమండ్రి దాటిన తర్వాత వేమగిరిలో వేలాదిగా జాతీయరహదారిపైకి అభిమానులు తరలి వచ్చారు. చంద్రబాబునాయుడు కాన్వాయ్ కి 3కిలోమీటర్ల పొడవున అభిమానులు వాహనాలతో బారులు తీరారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ సెంటర్ లో చంద్రబాబుకుటిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన ఇన్ చార్జి వేగుళ్ల లీలాకృష్ణ కృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వేలాదిగాప్రజలు, కార్యకర్తలు తరలి వచ్చారు. చంద్రబాబు జొన్నాడ సెంటర్ కు రాగానే పూలవర్షం కురిపించి, బాణాసంచాతో హోరెత్తించారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం‌లో సైతం బాబుకు ఘన స్వాగతం లభించింది.కోనసీమ నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో 5కిలోమీటర్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అమలాపురం, కొత్తపేట, ముమ్మడివరం, గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నుంచి వేలసంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. రాజమండ్రి నుంచి రావులపాలెంకు 30కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 3గంటలకుపైగా సమయం పట్టింది.

సిద్ధాంతం సెంటర్ లో చంద్రబాబు నాయుడుకు ఆచంట, నర్సాపురం నియోజకవర్గాల కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.చంద్రబాబు కాన్వాయ్‌ తణుకు చేరుకోడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. రాజమండ్రి నుంచి 40కిలోమీటర్ల దూరానికి 4గంటలకు పైగా సమయం పట్టింది. తణుకులో ఇన్ చార్జి ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అభిమాన నేతను చూసేందుకు తణుకు పరిసర గ్రామాలనుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. తాడేపల్లి గూడెం, ఉంగటూరుల మీదుగా బాబు కాన్వాయ్ సాగింది. ఉంగుటూరు టోల్ గేట్ వద్ద చంద్రబాబునాయుడుకు ప్రకాశం జిల్లా టిడిపి నేతలు దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బిఎన్ విజయకుమార్‌ స్వాగతం పలికారు.

భీమడోలు టోల్ గేట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్ ని అనుసరిస్తున్న వాహనాలను అడ్డుకునే యత్నం చేశారు. పూళ్ల,కురెళ్లగూడెం,పాతూరు సెంటరు మీదుగా చంద్రబాబు కాన్వాయ్ గుండుగొలను చేరుకుంది.ఏలూరు శివార్లలోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలవద్ద చంద్రబాబునాయుడుకు దెందులూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో భారీగా జనం తరలి వచ్చారు. ప్రధాన రహదారిపై సెల్ ఫోన్ లైట్లతో చంద్రబాబునాయుడుకు సంఘీభావం తెలిపారు.

కృష్ణా జిల్లాలో ఘన స్వాగతం

మంగళవారం రాత్రి 11.30కు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోకి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ చేరుకంది. రాత్రి 12గంటల ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ చేరుకున్నారు. పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు.గన్నవరం నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చారు.

హనుమాన్ జంక్షన్ లో చంద్రబాబుకు సీనియర్ నేతలు మండలి బుద్దప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ, గన్నవరం ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు, వెనిగళ్ల రాము, శ్రీరాం తాతయ్య, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. వీరవల్లి, అంపాపురం, మీదుగా పొట్టిపాడు టోల్ ప్లాజా వద్దకు న చంద్రబాబునాయుడు వాహనశ్రేణి చేరుకుంది. నం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి కాన్వాయ్ కు అడ్డుపడుతుండంతో ప్రయాణం ముందుకు సాగలేదు. అర్థరాత్రి1.30 గంటల ప్రాంతంలో ఆత్కూరు, పెదఅవుటపల్లి, చినఅవుటపల్లి మీదుగా గన్నవరం శివార్లకు చేరుకున్నారు.

గన్నవరం పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా జనం పోటెత్తారు. చంద్రబాబును చూసేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున అభిమానులు తరలి వచ్చారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానుల తాకిడితో అర్థగంటకు పైగా గన్నవరంలో చంద్రబాబునాయుడు కాన్వాయ్ నిలిచిపోయింది.

గన్నవరం వెంకటేశ్వర థియేటర్ వద్ద నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు రోడ్డుకి రెండు వైపులా నిలబడి పూలు చల్లుతూ నీరాజనాలు పట్టారు.

రాత్రి 3 గంటలప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ విజయవాడ శివారు ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడుకు

చేరుకుంది. తెల్లవారుజామున సైతం రోడ్లవెంట పెద్దసంఖ్యలో మహిళలు, అభిమానులు, ప్రజలు రోడ్లవెంట బారులు తీరారు.విజయవాడ

జిజిహెచ్, రమేష్ హాస్పిటల్, బెంజ్ సర్కిల్, కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో జనం పెద్దఎత్తున చంద్రబాబు కోసం ఎదురు చూశారు.

చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలికేందుకు విజయవాడ నగరంలో రోడ్లకు ఇరువైపులా జనం బారులుతీరారు.

రాత్రి 3.30గంటల ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది.

కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటలతరబడి ఎదురుచూశారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటలతరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

తెల్లవారుజామున 4.45గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ కు చేరుకున్నారు. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘనస్వాగతం పలికారు.

కాన్వాయ్ దారి మళ్లింపు ...

విజయవాడలో చంద్రబాబు కాన్వాయ్‌ను దారి మళ్లించారు. వారధి, తాడేపల్లి మీదుగా ఉండవల్లి వెళ్లాల్సిన కాన్వాయ్‌ను విజయవాడ నగరంలోకి మళ్లించారు.

బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్ ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.పోలీసుల తీరుతో మంగళగిరి నియోజకవర్గ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి నివాసం మీదుగా కాన్వాయ్ వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

బెంజిసర్కిల్ నుంచి బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ ఉదయం 5.15గంటల ప్రాంతంలో బందరు రోడ్డు మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకుంది.పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఎంపి కేశినని నాని కుమార్తె శ్వేత నేతృత్వంలో పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలికారు. డిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో విజయవాడ వన్ టౌన్ వినాయకుడి గుడి సెంటర్ కు చేరుకుంది.విజయవాడలో జనసేన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ కి ఎదురేగి స్వాగతం పలికారు.చంద్రబాబుకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.

14.30గంటల ప్రయాణం…

14.30గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45గంటల ప్రాంతంలో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబునాయుడు అలసటకు గురయ్యారు. ద్రబాబు ఉండవల్లి నివాసానికి రాగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్వేగానికి గురయ్యారు. రాజమండ్రి జైలు వద్ద మంగళవారం సాయంత్రం4.15గంటలకు బయలుదేరిన టిడిపి అధినేత చంద్రబాబు బుధవారం ఉదయం 5.45కు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.

WhatsApp channel