AP Rain Alert : ఏపీలోని 17 జిల్లాలకు వర్షసూచన.. ఈ ప్రాంతాలు ప్రజలు అలర్ట్‌గా ఉండాలి!-the disaster management agency has said that rains will occur in 17 districts of ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rain Alert : ఏపీలోని 17 జిల్లాలకు వర్షసూచన.. ఈ ప్రాంతాలు ప్రజలు అలర్ట్‌గా ఉండాలి!

AP Rain Alert : ఏపీలోని 17 జిల్లాలకు వర్షసూచన.. ఈ ప్రాంతాలు ప్రజలు అలర్ట్‌గా ఉండాలి!

AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఏపీలోని 17 జిల్లాలకు వర్షసూచన (@APSDMA)

సెప్టెంబర్ 20వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.

సెప్టెంబర్ 19వ తేదీన గురువారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.

'భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజీని ప్రకటించాం. విజయవాడ వరదల సమయంలో 10 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నే సచివాలయంగా మార్చుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి బాధితులకు సాయం చేశాను. ఇప్పుడు నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డాం' అని సీఎం చంద్రబాబు వివరించారు.

'విజయవాడ నగరంలో వారం పది రోజులు వరదలో చిక్కుకుని ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం, పై అంతస్తుల్లో ఉన్న వారికి రూ.10 వేలు ఆర్ధిక సాయం ఇస్తాం. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరదలకు ఇల్లు మునిగి ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సాయం అందిస్తాం. కిరాణా షాపులు, చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి రూ. 25 వేలు, ఎంఎస్ఎంఈ లకు, వ్యాపార సంస్థ స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించాం' అని చంద్రబాబు వివరించారు.

'దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ. 3 వేలు, ఆటోలకు రూ. 10 వేలు అందిస్తాం. అలాగే దెబ్బతిన్న ధాన్యం, ప్రత్తి, చెరకు, వేరుసెనగ పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు, అరటి, పసుపు వంటి ఉద్యానవన పంటలకు హెక్టార్ కు రూ. 35 వేలు సాయం చేస్తాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాలలో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

'బ్యాంకులు, ఇన్ స్యూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తున్నాం. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువుల కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తున్నాం. వరద సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటించాము' అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.