నేటి నుంచే 'తల్లికి వందనం' స్కీమ్... తల్లుల ఖాతాలోకి డబ్బుల జమ - ముఖ్యమైన 10 విషయాలు-thalliki vandanam scheme 2025 to be implemented in andhrapradesh from today key points here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నేటి నుంచే 'తల్లికి వందనం' స్కీమ్... తల్లుల ఖాతాలోకి డబ్బుల జమ - ముఖ్యమైన 10 విషయాలు

నేటి నుంచే 'తల్లికి వందనం' స్కీమ్... తల్లుల ఖాతాలోకి డబ్బుల జమ - ముఖ్యమైన 10 విషయాలు

నేటి నుంచే తల్లికి వందనం స్కీమ్ అమల్లోకి రానుంది. తల్లుల ఖాతాలోకి నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ స్కీమ్ కింద 67,27,164 మంది లబ్ధి పొందనున్నారు.

తల్లికి వందనం స్కీమ్

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలకమైన స్కీమ్ ను పట్టాలెక్కించనుంది. ఇవాళ్టి నుంచి తల్లికి వందనం స్కీమ్ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. అర్హులైన తల్లుల ఖాతాలోకి నేరుగా డబ్బులను జమ చేయనుంది. ప్రభుత్వం నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచే తల్లికి వందనం స్కీమ్ ను అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 67 లక్షల మందికిపైగా తల్లుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు.

తల్లికి వందనం స్కీమ్ - ముఖ్యమైన అంశాలు:

  1. సూపర్‌ సిక్స్‌లో మరో హామీకి ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి(జూన్ 12) నుంచి 'తల్లికి వందనం' పథకం అమల్లోకి రానుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తి కానుంది.
  2. ప్రస్తుతం 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
  3. ఈ స్కీమ్ కింద ఇవాళ రూ. 8745 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
  4. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా అర్హులవుతారు.
  5. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.
  6. ఈ స్కీమ్ కింద ఏడాదికి రూ. 15 వేలు లబ్ధిదారుడికి అందజేస్తారు.
  7. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
  8. వైసీపీ హయాంలో ‘అమ్మఒడి’ పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ పేరుతో అమలు చేయనుంది.
  9. గతంతో పోల్చితే లబ్ధిదారులు 24,65,199 మంది పెరగినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. నిధుల వ్యయం రూ.2,352.06 కోట్లు పెరిగినట్లు తాజాగా వెల్లడించింది.
  10. బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుండా డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్పీసీఐతో లింక్ చేయబడి ఉండాలని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా డబ్బులు జమవుతాయని చెబుతున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.