Telugu News  /  Andhra Pradesh  /  Tenali Murder Case Husband Suspects Wife And Killed Her
అనుమానంతో భార్యను హత్య చేసిన కిరాతకుడు
అనుమానంతో భార్యను హత్య చేసిన కిరాతకుడు (HT_PRINT)

Tenali murder case: చంపి శవానికి దండేసిన మొగుడు

18 November 2022, 8:26 ISTHT Telugu Desk
18 November 2022, 8:26 IST

Tenali murder case: భార్యను చంపి పూల దండేసిన ఓ శాడిస్టు మొగుడి క్రైమ్ స్టోరీ ఇది

Tenali murder case: తెనాలి నాజరుపేటలో దారుణం జరిగింది. వెంకట కోటయ్య సొంత లారీ నడుపుతూ జీవనం సాగిస్తుండగా, భార్య స్వాతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. వీరికి ఇంటర్మీడియట్, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

హాపీగా సాగుతున్న కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. భార్య స్వాతిపై వెంకట కోటయ్య అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై చాలా రోజులుగా భార్యతో గొడవపడుతున్నాడు. మరోవైపు వెంకట కోటయ్య మద్యానికి బానిసగా మారాడు. ఆమె పేరిట ఉన్న స్థలాన్ని అమ్మాలని ఒత్తిడి తెస్తూ విపలమవడంతో కోపం పెంచుకున్నాడు. మాట వినని భార్యను ఎలాగైనా హతమార్చాలని ప్రణాళిక రచించాడు. గురువారం మధ్యాహ్నం ఆల్కహాల్ తాగి స్వాతి పనిచేస్తున్న బ్యూటీపార్లర్ చేరుకున్నాడు.

తన వెంట కత్తి, పూల దండ కూడా తెచ్చుకున్నాడు. బ్యూటీపార్లర్‌లో కస్టమర్లు ఉండడంతో వారు వెళ్లేవరకూ వేచి ఉన్నాడు. ఆ తరువాత డోర్ క్లోజ్ చేసి భార్యపై దాడి చేశాడు. గ్లాస్ డోరు కావడం, కర్టెన్లు ఉండడంతో లోపలి నుంచి శబ్దం గానీ, దృశ్యం గానీ బయటకు పొక్కలేదు. 

వెంకట కోటయ్య స్వాతిపై కత్తితో చాలాసార్లు పొడిచాడు. వీపు, మెడ, చేతులతో సహా శరీరంలోని పలు భాగాల్లో స్వాతి కత్తిపోట్లకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. చనిపోయాక ఆమె మృతదేహంపై వెంకటకోటయ్య తాను తెచ్చిన పూల దండలు వేసి నివాళులు అర్పించి ఇంటికి వెళ్లాడు. తాను పొడవడానికి ఉపయోగించిన కత్తిని ఇంటి దగ్గర పెట్టి నడుచుకుంటూ వెళ్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 

 

 

టాపిక్