AP IPS Transfers : ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ-ten ips officers transfer in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ips Transfers : ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

AP IPS Transfers : ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 16, 2024 09:55 PM IST

AP IPS Transfers : ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. అనంతపురం ఎస్పీగా జగదీష్‌ నియమితులయ్యారు. సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ కాగా…గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా సుమిత్‌ సునీల్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ అయ్యారు. సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ కాగా…. గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా సుమిత్‌ సునీల్‌ నియమితులయ్యారు. అనంతపురం ఎస్పీగా జగదీష్‌, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ వ్యవహరించనున్నారు.

విజయవాడ డీసీపీగా మహేశ్వర్‌ రాజు, గుంతకల్‌ రైల్వే ఎస్పీగా రాహుల్‌ మీనా నియమితులయ్యారు. ఇంటలిజెన్స్‌ ఎస్పీగా నచికేత్‌ విశ్వనాథ్‌, చింతూరు ఏఎస్సీగా పంకజ్‌కుమార్‌ మీనా, పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురాన్‌ అంకిత్‌ బదిలీ అయ్యారు.

  • అనంతపురం ఎస్పీగా జగదీష్‌ బదిలీ.
  • విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ.
  • విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజు.
  • గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా సునీల్‌.
  • గుంతకల్‌ రైల్వే ఎస్పీగా రాహుల్‌ మీనా,
  • ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా నచికేత్‌ విశ్వనాథ్‌.
  • చింతూరు ఏఎస్పీగా పంకజ్‌కుమార్‌ మీనా.
  • పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురానా అంకిత్‌ బదిలీ అయ్యారు.

వెయిటింగ్ లిస్ట్ లో పలువురు ఐపీఎస్ లు…

వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారనే ఆరోపణలతో పోస్టింగ్‌లకు దూరమైన పలువురు ఐపీఎస్‌ అధికారులపై ఇటీవలే రాష్ట్ర డీజీపీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పోస్టింగ్‌ లేకపోవడంతో ఆఫీసుకు రాకుండా కాలక్షేపం చేస్తున్న ఐపీఎస్‌లపై కొరడా ఝుళిపించారు. హెడ్‌ క్వార్టర్లు విడిచి వెళ్లకూడదనే ఆదేశాలను పాటించకుండా పలువురు ఐపీఎస్‌లు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో చర్యలు చేపట్టారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులు రోజూ ఉదయం పదికల్లా ఆఫీసుకు రావాలని ఆదేశించారు. 

మొత్తం 16మంది పేర్లతో కూడిన జాబితాతో డీజీపీ మెమో జారీ చేశారు. వీరంతా ఇకపై డీజీపీ కార్యాలయంలో రోజూ అటెండెన్స్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. పోస్టింగ్‌ లేకపోవడంతో విధులకు హాజరు కాని ఐపీఎస్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీరిలో డీజీ స్థాయి అధికారులు పీవీ సునీల్‌ కుమార్‌, పిఎస్సార్‌ ఆంజనేయులు సహా 16మంది ఐపీఎస్‌లు ఇకపై రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆఫీసర్స్‌ వెయిటింగ్‌ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు. ఉదయం పది నుంచి అందుబాటులో ఉండాలని విధులు ముగించుకుని వెళ్లే సమయంలో సమయం నమోదు చేయాలని అత్యవసర విధుల కేటాయింపుకు డీజీపీకి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

వెయిటింగ్‌లో ఉన్న వారిలో డీజీ క్యాడర్‌లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్సార్ ఆంజనేయులు, మాజీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్ కుమార్‌, అదనపు డీజీ సిఐడి మాజీ చీఫ్‌ ఎన్‌.సంజయ్, విజయవాడ మాజీ సీపీ తాతా కాంతిరాణా, ఐజీ పాలరాజు, సీఐడీ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, సిహెచ్‌ విజయరావు, విశాల్‌ గున్నీ, ఎస్పీ క్యాడర్‌లో ఉన్న అన్బురాజన్‌, రవిశంకర్‌ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్‌ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్‌ పాటిల్‌సంజయ్, కొల్లి రఘురామరెడ్డి, సంజయ్ ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది అధికారులు సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి…!

 

టాపిక్