తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో అయితే కాస్త తీవ్రత ఎక్కువగానే ఉంది. సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఫిబ్రవరి పూర్తి కాకముందే వేసవిని తలిపించేలా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందిపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నాం సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది.
ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో ఉత్తర, ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తూర్పు, ఆగ్నేయం దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఏపీలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
దక్షిణ కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం ఉండనుంది.రాయలసీమలో చూస్తే ఇవాళ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.
శనివారం ఏపీలోని ఏలూరులో 37 డిగ్రీలు, నంద్యాలలో 37 డిగ్రీలు, కర్నూలు 36.8 డిగ్రీలు, అనంతపురం 35 డిగ్రీలు, శ్రీకాకుళం 34.5 డిగ్రీలు, కడప 34.3, బాపట్ల 33,2 డిగ్రీల ఉష్ణోగ్రతుల నమోదయ్యాయి.
ఇక తెలంగాణలో చూస్తే వారంరోజుల పాటు పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను తెలిపింది. ఉదయం సమయంలో కొన్నిచోట్ల మాత్రమే పొగమంచు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
శనివారం(ఫిబ్రవరి 8, 2025) తెలంగాణలోని ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, వరంగల్, మహబూబాద్, వనపర్తి, జనగాం, పెద్దపల్లి జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాలో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగద్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలోని మధిరలో అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
సంబంధిత కథనం