AP Heatwaves: మార్చిలో మంటలు.. ప్రకాశం జిల్లాలో 42డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత, ఉక్కపోతతో విలవిల
AP Heatwaves: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేయడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో ఏపీలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.
AP Heatwaves: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 42.1, కర్నూ లులో 41.7, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపే టలో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.8, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలలో 41 డిగ్రీల ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 91 మండ లాల్లో వడగాలులు వీచాయి. శుక్రవారం రాష్ట్రంలోని 83 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విప త్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు బయటకు వెళ్లే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తీవ్ర వడగాలులు వీచే మండలాలు 89 ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 22 మండలాలు, శ్రీకాకుళం 14, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామ రాజు 9, అనకాపల్లి 9, తూర్పుగోదావరి 8, కాకినాడ 7, ఏలూరు 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది.
వడగాలులు వీచే మండలాలు 208 ఉన్నాయి. పల్నాడు జిల్లాలో 26 మండ లాలు, ఏలూరు 22, గుంటూరు 17, కృష్ణా 17, ప్రకాశం 14, శ్రీకాకుళం 14, కాకినాడ 13, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 12, ఎన్టీఆర్ 12, తూర్పుగోదా వరి 11, పశ్చిమగోదావరి 11, అనకాపల్లి 9, బాపట్ల 9, అల్లూరి సీతారామ రాజు 6, విజయనగరం 5, విశాఖపట్నం 4, పార్వతీపురం మన్యం 3, తిరు పతి 2, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక మండలంలో వడగా లుల ప్రభావం ఉండనుంది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా -14, విజయనగరం జిల్లా-5, పార్వతీపురంమన్యం జిల్లా-3, అల్లూరి సీతారామరాజు జిల్లా-6, విశాఖ-4, అనకాపల్లి-9, కాకినాడ-13, కోనసీమ-12, తూర్పుగోదావరి-11, పశ్చిమగోదావరి-11, ఏలూరు-22, కృష్ణా -17, ఎన్టీఆర్-12, గుంటూరు-17, బాపట్ల-9, పల్నాడు-26, ప్రకాశం-14, నెల్లూరు-1, తిరుపతి-2 మండలాల్లో వడగాలులు (208) వీచే అవకాశం ఉందన్నారు. శనివారం 36 మండలాల్లో తీవ్రవడగాలులు, 194 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని ఎండలోకి వెళ్లేపుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
సంబంధిత కథనం