హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లో ఏపీ సివిల్ సప్లైస్‌ భవనాన్ని అద్దెకు తీసుకున్న తెలంగాణ పౌర సరఫరాల శాఖ-telangana civil supplies department has rented the ap civil supplies building in hyderabad ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లో ఏపీ సివిల్ సప్లైస్‌ భవనాన్ని అద్దెకు తీసుకున్న తెలంగాణ పౌర సరఫరాల శాఖ

హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లో ఏపీ సివిల్ సప్లైస్‌ భవనాన్ని అద్దెకు తీసుకున్న తెలంగాణ పౌర సరఫరాల శాఖ

Sarath Chandra.B HT Telugu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2017 సెప్టెంబర్ నుంచి ఏపీ సివిల్ సప్లైస్‌ కార్పొరేషన్‌ విజయవాడ కేంద్రంగా పనిచేస్తోంది. విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో ఉన్న కార్పొరేషన్‌ భవనం ఏపీకి కేటాయించగా తాజాగా దానిని తెలంగాణకు అద్దెకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

ఏపీ తెలంగాణ మధ్య సివిల్ సప్లైస్‌ భవనంపై ఒప్పందం

హైదరాబాద్‌‌లో ఏపీ, తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల మధ్య సమావేశంలో ఎర్రమంజిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ భవనాన్ని తెలంగాణకు అద్దెకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్రాల మంత్రులు నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పౌర సరఫరాల విభజనతో ఎర్రమంజిల్ భవనం ఏపీకి దక్కింది. ప్రస్తుతం ఈ భవనాన్ని తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అద్దెకు తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.

ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర సరఫరాల శాఖ విభజన, పరస్పర సహకార అంశాలపై చర్చలు జరగాయి. విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ భవనాన్ని తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ అద్దెకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ అద్దె ఒప్పందంపై ఇరుపార్టీల మధ్య ఇవాళ అవగాహన ఒప్పందపై సంతకాలు జరిగాయి.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతాంగాన్ని కాపాడుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దీపం-2 పథకం కింద ఒక కోటి పది లక్షల లబ్ధిదారులకు సబ్సిడీ అందిస్తున్నట్టు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సివిల్ సప్లై అనుసంధానంతో ఈ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ఎగుమతుల ప్రోత్సాహంతో రైతులకు నష్టం లేకుండా చూస్తాం” అని పేర్కొన్నారు.

సమావేశంలో చర్చించిన విషయాలు ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు మంత్రి వివరించారు. ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లి మార్పు తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో పౌర సరఫరాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు..

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.