November 23 Telugu News Updates: బీఎల్ సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలన్న హైకోర్టు-telangana and andhrapradesh telugu live news updates 23 november 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Telangana And Andhrapradesh Telugu Live News Updates 23 November 2022

ఏపీ తెలంగాణ వార్తలు,

November 23 Telugu News Updates: బీఎల్ సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలన్న హైకోర్టు

తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Wed, 23 Nov 202203:16 PM IST

బీఎల్ సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలన్న హైకోర్టు

సిట్‌ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరు​పై హైకోర్టు విచారణ చేసింది. బీఎల్ సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని ఏజీ కోరారు. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని కోర్టు సిట్​కు ఆదేశాలిచ్చింది.

Wed, 23 Nov 202211:06 AM IST

విజయసాయి రెడ్డి ఫోన్ మిస్సింగ్

ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫోన్ పోయిందని ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ వెళ్లింది. అయితే అది కాదు.. వేరే విషయం ఉందని మరోవైపు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

Wed, 23 Nov 202207:33 AM IST

చంద్రబాబు ఢిల్లీ టూర్…. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి.. చంద్రబాబు హాజరుకానున్నారు. 2022 డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకు జరగనున్న జీ 20 దేశాల కూటమి సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించనుంది. రాజకీయ పార్టీల అధ్యక్షులతో.. జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశంలో ప్రధాని మోదీ చర్చించనున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని చంద్రబాబుకు.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి ఆహ్వానం అందింది. చంద్రబాబుకు ఫోన్‌ చేసి భేటీపై సమాచారం అందించారు. సమావేశ ప్రాధాన్యతను కేంద్రమంత్రి చంద్రబాబుకు వివరించారు.

Wed, 23 Nov 202206:44 AM IST

పంపిణీ ప్రారంభం…

‘జగనన్న భూ హక్కు-భూ రక్ష’ పత్రాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. నర్సన్నపేట సభలో మాట్లాడిన ఆయన… తొలి విడతలో భూహక్కు పత్రాలను అందించారు. డిసెంబర్ 2023 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు సీఎం.

Wed, 23 Nov 202206:29 AM IST

బాలిక సూసైడ్… 

హిజ్రాల వేధింపులు భరించలేక ఓ బాలిక సూసైడ్ చేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చకపోవటమే ఇందుకు కారణమైంది. ఈ ఘటన ఏపీలోని విజయవాడ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Wed, 23 Nov 202205:34 AM IST

నరసన్నపేట చేరుకున్న సీఎం జగన్‌

విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి హెలికాప్టర్ ద్వారా నరసన్నపేటకు చేరుకున్నారు సీఎం జగన్.

Wed, 23 Nov 202205:33 AM IST

కానిస్టేబుల్ అరెస్ట్

అతను ఓ టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌..! హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంతవరకు ఒకే... సీన్ కట్ చేస్తే... గ్యాంగ్ స్టార్ గా ఎదగాలని అనుకున్నాడు. పెద్ద నెట్ వర్క్ ను క్రియేట్ చేశాడు...! ఇందుకోసం భారీ ప్లాన్ నే రచించాడు. మరో కానిస్టేబుల్ తో పాటు పలువురు అధికారులు కూడా అతనికి సాయం అందించినట్లు విచారణలో బయటపడింది. అంతేకాదు.... సెల్‌ఫోన్‌ చోరులతో నెట్‌వర్క్‌, దొంగతనాలు చేసే ముఠాలతో తన ప్లాన్ ను ఆపరేట్ చేస్తూ వచ్చాడు. అయితే ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించిన నల్గొండ జిల్లా పోలీసులకు ఇతగాడి నేర బాగోతం తెలిసింది. ఫలితంగా ఈశ్వర్ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది.

Wed, 23 Nov 202204:35 AM IST

మంత్రి బైఠాయింపు…. 

అధికారులు తన కుమారుడిని ఇబ్బంది పెట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. CRPF బలగాలు ఛాతీపై కొట్టారు అందుకే ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. ఐటీ రైడ్స్ రాజకీయ కక్ష అన్న ఆయన... మేము స్మగ్లింగ్ చేయట్లేదన్నారు.  మల్లారెడ్డితో పాటే ఐటీ అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. తన కొడుకును కూడా ఐటీ అధికారులు చూడనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి సూరారంలోని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. 

Wed, 23 Nov 202203:10 AM IST

మరో ఇద్దరికి నోటీసులు

ఎమ్మెల్యేల ఎర కేసులో మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చింది సిట్. నందకుమార్ భార్య చిత్రలేఖతో పాటు అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు కూడా నోటీసులు అందాయి. ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

Wed, 23 Nov 202203:08 AM IST

కొనసాగుతున్న దాడులు… 

మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy), ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు(IT Officials) ఏకకాలంలో దాడులు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే అధికారుల సోదాలు మెుదలయ్యాయి. సుమారు 50 బృందాలుగా ఏర్పడి.. ఆయనకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టగా.. బుధవారం కూడా కొనసాగుతున్నాయి. షిఫ్ట్ వైజ్ గా అధికారులు పని చేస్తున్నారు.

Wed, 23 Nov 202202:35 AM IST

ఐటీ రైడ్స్… 

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మరోవైు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావటంతో ఆస్పత్రికి తరలించారు.

Wed, 23 Nov 202201:49 AM IST

కాలర్ పట్టుకున్న ఎమ్మెల్యే

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ అధికారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రాకుండా ఓ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడంపై తీవ్రస్థాయిలో పరుషపదజాలం ప్రయోగించారు. అంతేకాదు... ఏకంగా అధికార కాలర్ పట్టుకుని పక్కకు నెట్టేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. తాను రాకముందే బీసీ గురుకుల పాఠశాలను ఎలా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

Wed, 23 Nov 202201:22 AM IST

కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్…

జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ (BL Santhosh) కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్.. దేశం కోసం పనిచేస్తున్న గొప్ప వ్యక్తి బీఎల్ సంతోష్ అని కొనియాడారు. బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు ఫామ్ హౌసులు, బ్యాంక్ అకౌంట్లు లేవని తెలిపారు. నోటీసుల పేరుతో సంఘ్ ప్రచారక్‌లను అవమానిస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. దేశం కోసం పనిచేసే వ్యక్తికి నోటీసులెలా ఇస్తారంటూ స్టేజి మీదే కన్నీటి పర్యంతమయ్యారు.

Wed, 23 Nov 202201:22 AM IST

తుషార్ కు లుక్ అవుట్ నోటీసులు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తుషార్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్.  న్యాయవాది శ్రీనివాస్ ను బుధవారం కూడా విచారణ జరపనుంది.

Wed, 23 Nov 202201:20 AM IST

ప్రత్యేక రైళ్లు

చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం - మహబూబ్ నగర్, కాచిగూడ - కొల్లాం, కొల్లాం- కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను చూస్తే......

visakhapatnam to mahabubnagar special trains:

విశాఖపట్నం - మహబూబ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీల్లో వీటిని నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో విశాఖ నుంచి సాయంత్రం 05.35 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.30 నిమిషాలకు మబబూబ్ నగర్ కు చేరుకుంటుంది.

ఇక మహబూబ్ నగర్ - విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ట్రైన్స్ డిసెంబర్ 7 నుంచి 28వ తేదీల మధ్య అందుబాటులో ఉంటాయి. ఈ రైలు... మహబూబ్ నగర్ నుంచి సాయంత్రం 06.20 నిమిషాలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 09.50 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటాయి.