CBN Letter: ఎన్నికల సంఘానికి లేఖ రాసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు-tdp president chandrababu wrote a letter to the election commission ceo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Letter: ఎన్నికల సంఘానికి లేఖ రాసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

CBN Letter: ఎన్నికల సంఘానికి లేఖ రాసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Dec 08, 2023 01:47 PM IST

CBN Letter: ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలను సరి చేయాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాశారు.

చంద్రబాబు
చంద్రబాబు

CBN Letter: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని బాబు ఆరోపించారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని వివరించారు. .

మాన్యువల్ ప్రకారం జనాభా పరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాల్సి ఉన్నా అలా చేయడం లేదన్నారు. ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తించబడుతూనే ఉన్నాయని, ఇంటింటి సర్వేలో బాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగించాలని అలా చేయడం లేదన్నారు. .

డ్రాఫ్ట్‌ ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ – 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.

అర్హత లేని వారికి సైతం ఫామ్ – 6 ద్వారా ఆన్‌లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని వీటిపై టీడీపీ అభ్యంతరాలపై నేటికి దృష్టి పెట్టలేదన్నారు.

నేరుగా కానీ, ఆన్‌లైన్‌లో గానీ బల్క్‌గా ఫామ్-7 ధరఖాస్తులను స్వీకరించ రాదని, ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలన్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.

నేటికి ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఓట్లు మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సంధర్బంగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. డ్రాప్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా పైన పేర్కొన అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ఫైనల్ లిస్టులో ఓట్ల అవకతవకలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయం కల్లా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు.