TDP Chandra Babu : జనం హృదయాల్లో ఉన్నా..! వెళ్లి వెదుక్కోమన్న చంద్రబాబు
TDP Chandra Babu చంద్రబాబు నాయుడు ఇల్లెక్కడుందన్న జగన్మోహన్ రెడ్డి ప్రశ్నకు టీడీపీ అధ్యక్షుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బొబ్బిలి కోటకు వచ్చి చూడాలని సవాలు చేశారు. తాను ప్రజల హృదయాల్లో ఉంటానని, ప్రజల మనసుల్లో ఉంటానని చెప్పారు. తెలుగు వారికి ఆత్మవిశ్వాసం ఇచ్చానని, తెలుగు వారు అమెరికాలో ఉన్న, తమిళనాడులో ఉన్నా, తెలంగాణలో ఉన్నా వాళ్ళతోనే ఉంటానని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ ఉంటానని జగన్మోహన్ రెడ్డికి ఇదే తన సమాధానమన్నారు.
TDP Chandra Babu టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి భాగంగా ఉత్తరాంధ్రలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాాలను ఎండగడుతున్నారు. చంద్రబాబు యాత్రకు భారీగా జనం తరలి వస్తున్నారు.
విజయనగరం జిల్లా, బొబ్బిలి లో ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బొబ్బిలికి రావడం ఇదేమీ కొత్త కాదని, తానేం సినిమా నటుడుని కాదని, అయినా జన సందోహం ఎందుకు వచ్చిందన్నారు. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో చంద్రబాబు ఇంతటి సభను ఎప్పుడూ చూడలేదన్నారు.
శివుడు భస్మాసురుడుని నమ్మినట్లు, జనం ఒక్క ఛాన్స్ మాటకు పడి పోయి జగన్ ను నమ్మారన్నారు. గెలిచిన తర్వాత జనం నెత్తి మీద చెయ్యి పెట్టాడని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం ఒక్కటే పరిష్కారమని చంద్రబాబు చెప్పారు.
ఎమ్మిగనూరు నుంచి చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాల్లో ఎ క్కడ చూసినా జనం భారీగా తరలి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. తనకు బహిరంగ సభలు కొత్త కాదని, జనం స్పందన చూస్తుంటే తనకు బాగా హుషారు వస్తోందన్నారు. ఏపీ డీజీపీ ఒక్క సారి టీవీ చూడాలని, ఈ జనాన్ని కంట్రోల్ చేయగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు. బొబ్బిలి సభ చూస్తేనే ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుస్తోందన్నారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసులకు ప్రభుత్వంబకాయిలు ఇచ్చారా, జీపీఎఫ్ లు చెల్లించారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్రంలో వీలైనంత తొందరగా వైసీపీని కాంక్రీట్ తో సమాధి చెయ్యాలన్నారు. అన్న క్యాంటీన్ నిలిపివేశారని బొబ్బిలిలో బేబీ నాయన భోజనం పెడతాను అంటే సిఎం వద్దంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రూ.200 పించన్ ను రూ.2000 చేసింది టీడీపీనేనని, మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే రూ.3000 ఇచ్చే వాళ్ళమన్నారు. జగన్ ఒక్క ఇల్లు కట్టడా? టిడ్కొ ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జగన్ మూడున్నరెళ్ళలో 5 ఇళ్ళు కట్టాడని కేంద్రమే పార్లమెంట్ లో చెప్పిందని, అది సిగ్గు అనిపించలేదా అని జగన్‌ను నిలదీశారు. టీడీపీ హయంలో ఉన్న పథకాలు ఎందుకు అదృశ్యం అయ్యాయని ప్రశ్నించారు.
బొబ్బిలి నియోజకవర్గంలో షాడో ఎమ్మేల్యే ఉన్నారని ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అవినీతి చేస్తున్నాడని ఆరోపించారు. బొబ్బిలిలో ఎమ్మెల్యే 1000 అడుగుల స్థలాన్ని కూడా వదలకుండా కొట్టేశాడని మండిపడ్డారు. జగన్ చేస్తున్నది బటన్ నొక్కుడు కాదని మొత్తం బొక్కుడేనన్నారు. ఉత్తరాంధ్ర లో సాయిరెడ్డి, సుబ్బా రెడ్డీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. వారి ఆగడాలను బొత్స, ధర్మాన ఎందుకు అడగలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో పెత్తనం అంతా సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డీ, పెడ్డిరెడ్డిలదేనని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించడం సామాజిక న్యాయమా అని నిలదీశారు.
టాపిక్