Telugu News  /  Andhra Pradesh  /  Tdp President Chandra Babu Naidu Blames Ysrcp Government Fails In Tidco Housing Projects
కర్నూలులో టిడ్కో ఇళ్లను పరిశీలిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
కర్నూలులో టిడ్కో ఇళ్లను పరిశీలిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

NCBN In KURNOOL : ప్రభుత్వ విధ్వంసానికి టిడ్కో ఇళ్లే నిదర్శనం….చంద్రబాబు

19 November 2022, 12:12 ISTHT Telugu Desk
19 November 2022, 12:12 IST

NCBN In KURNOOL ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన విధ్వంసానికి టిడ్కో ఇళ్లే ఉదాహరణ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒక అసమర్థ ముఖ్యమంత్రి, ఒక చేతకాని ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది టిడ్కో ఇళ్లను చూస్తే తెలుస్తోందన్నారు. వైసీపీ వారు విధ్వంసాన్ని ఏ విధంగా చేస్తారో ఇక్కడుండే టిడ్కో హౌసింగే ఒక ఉదాహరణగా నిలుస్తందని ఆరోపించారు.

NCBN In KURNOOL కర్నూలె గతంలో పదివేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తే 90 శాతం పనులు పూర్తయ్యాయని, 580 కోట్ల రూపాయల ప్రాజెక్టు ద్వారా అందరికీ ఇళ్లు కట్టివ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులిచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. లక్షా 50 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, దాన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్షా 50 వేలు వాటా వేసి ప్రభుత్వ భూమిలో మంచి వాతావరణంలో ఇళ్లను ప్రారంభించామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

మధ్యతరగతి గేటెడ్ కమ్యునిటీ ఏర్పాటు చేయాలని ప్రారంభోత్సవం చేశామని, పేదవారికి సొంతింటి భావన ఉంటుందని, ఎప్పుడైన అమ్ముకోవచ్చనుకుంటే దానికి రియల్ ఎస్టేట్ వ్యాల్యు ఉండేలా రూపొందించామన్నారు. ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా తయారు చేశామని, కమ్యూనిటీ హాల్, ప్రైమరీ సెంటర్, అంగన్వాడీ, స్కూల్క్ పెట్టామని చెప్పారు. 3 లక్షల 10వేల టిడ్కో ఇళ్లు నిర్మించామని, పది శాతం పూర్తి చేసివుంటే లబ్దిదారులకు ఇవ్వడానికి అనుకూలంగా ఉండేవన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 30 లక్షల ఇళ్లను ప్రారంభించామని, చాలా వాటిలో గృహ ప్రవేశాలు కూడా చేశారన్నారు.

నిర్మాణాలు పూర్తైన వాటిని పేదవారికి ఇచ్చేసివుంటే ఈ పాటికి మూడు, నాలుగు లక్షల ఆస్తి అయ్యేదని, ఇప్పుడు మొత్తం పోయే పరిస్థితికి వచ్చిందన్నారు. ఈ టిడ్కో ఇళ్ల లోపలికి వెళ్లి చూస్తే అంతా తుప్పు పట్టిపోయాయని, గదులన్నీ బూజు పట్టి ఉన్నాయన్నారు. ఎంతో డబ్బు పెట్టి కట్టిన ఇళ్లు పనికిరాకుండా చేశారని, దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు.

వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా ప్రవర్తించారని వ్యక్తిగతంగా లక్షా 50వేలు, ప్రభుత్వం ఇచ్చే ఒక లక్షా 50 వేలు మొత్తం 3 లక్షలతో బ్రహ్మాండంగా ఇళ్లు అయ్యేవని, ఆ స్కీమ్ కూడా ఇప్పుడు నిలిచిపోయిందని ఆరోపించారు. గవర్నమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యానికి తూట్లు పొడిచారు. లేబర్ కాస్ట్ పెరిగిందని, ప్రభుత్వ సాయాన్ని గతంలో కంటే తగ్గించి ఇస్తే ఎలా ఇళ్లు కట్టుకోగలరని ప్రశ్నించారు. ఇళ్ల కోసం ల్యాండ్ అక్విజేషన్ చేశానని చెప్పు కుంటున్నారే తప్ప ఉపయోగంలేదని విమర్శించారు. అడవుల్లో, చెరువుల్లో స్థలాలు ఇచ్చారని, వాటి వల్ల ఉపయోగం లేదన్నారు.

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు అధికమయ్యాయని, వైసీపీలోని ఛోటా మోటా నాయకులంతా దొంగల్లా తయారయ్యారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 50 కార్పొరేషన్లు పెట్టారుగానీ ఆ కార్పొరేషన్ ఆఫీసులలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవని విమర్శించారు. విశాఖను రాజధాని చేస్తామనేది, విశాఖ ప్రజలపై ఉన్న ప్రేమతో కాదుని, అక్కడి భూములపై ఉన్న ప్రేమ అన్నారు. వైసీపీ నాయకులు అనేక చోట్ల భూములు కబ్జా చేశారని, ప్రజలందరూ గమనిస్తున్నారని, ఎవరినీ వదిలి పెట్టమని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో దోచుకో దాచుకో కార్యక్రమం మొదలుపెట్టారని, మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అభివృద్దికి పని చేయాలని, వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.