TDP Mlc Son No More : ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి-tdp mlc ramachandraiah son died with heart attack chiranjeevi chandrababu condolence ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Mlc Son No More : ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

TDP Mlc Son No More : ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Bandaru Satyaprasad HT Telugu
Dec 28, 2024 10:27 PM IST

TDP Mlc Son No More : టీడీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మరణించారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు గుండెపోటుతో మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

TDP Mlc Son No More : టీడీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్ గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా విష్ణుస్వరూప్ మరణించారు. రామచంద్రయ్య కుటుంబాన్ని సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు.

yearly horoscope entry point

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. విష్ణు స్వరూప్‌కు గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విష్ణు స్వరూప్ మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. విష్ణు స్వరూప్‌ మరణవార్త తెలిసిన సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి... రామచంద్రయ్య నివాసానికి వెళ్లి... విష్ణు స్వరూప్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. రామచంద్రయ్యతో విష్ణుస్వరూప్ కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు. రామచంద్రయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

సి.రామచంద్రయ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీక రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక...మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తనయుడు విష్ణుస్వరూప్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విష్ణుస్వరూప్ గుండెపోటుతో మరణించడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. కుమారుడి మృతితో విషాదంలో ఉన్న రామచంద్రయ్య కుటుంబానికి దేవుడు మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరారు. రామచంద్రయ్య కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

"శాసన మండలి సభ్యులు సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ ఆకస్మిక మరణం దురదృష్టకరం. విష్ణు స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. పుత్ర వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రామచంద్రయ్యకు భగవంతుడు అందించాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను" - డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్

Whats_app_banner