Lokesh Yuvagalam: వెంట్రుక పీకలేరంటే..జనం గుండు కొట్టించారన్న లోకేష్
Lokesh Yuvagalam:Lokesh Yuvagalam: ఎవరు వెంట్రుక పీకలేరంటే.. ప్రజలు ఏకంగా గుండు కొట్టించారని, ముఖ్య మంత్రిని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. యువ గళం దెబ్బకు జగన్ కు దిమ్మదతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా 2024లో చూపిస్తామన్నారు.
Lokesh Yuvagalam: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా 2024లో చూపిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సైకో పాలనపై ప్రజల విజయమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే స్లోగన్... సైకోపోవాలి-సైకిల్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
నారా లోకేష్ యువగళం యాత్ర 47వరోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సాగింది. పాదయాత్రలో 600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న లోకేష్‌కు కదిరి నియోజకవర్గంలో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపిన ప్రజానీకం తెలిపారు. యువగళం పాదయాత్ర 47వరోజు కదిరి నియోజకవర్గం నల్లచెరువు శివార్లలో 600 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది.
తన తల్లిని అవమానించిన వారిని కట్ డ్రాయర్ పై ఊరేగిస్తానని కదిరిలో లోకేష్ శపథం చేశారు. అధికార మదం తలకెక్కి నా వెంట్రుక కూడా పీకలేరు అన్నావని,. ప్రజలు ఏకంగా నీకు గుండు కొట్టించారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సైకోపాలనపై ప్రజా విజయమని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా కదిరి నియోజకవర్గం జొన్నపేటలో యువనేత లోకేష్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... యువగళం దెబ్బకు జగన్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది, ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా 2024లో చూపిస్తాం, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా టిడిపి క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్నారు.
ఎన్నికల ముందు సెమీఫైనల్స్ అన్నవాళ్లు ఫలితాలు వచ్చాక తూచ్...అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవాచేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పదవికి పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్లను వైసీపీ నిలబెట్టిందని, 108 నియోజకవర్గాల యువత వైసీపీని ఛీ కొట్టారన్నారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన దాఖలాలు చరిత్రలో మనం చూడలేదని, కానీ వైసీపీ ఆరోపించిందన్నారు.
వై నాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి... బైబై జగన్ అంటూ యువత తీర్పునిచ్చారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తికి తగిన గుణపాఠమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని చెప్పారు. ఎన్నిచేసినా ప్రజలు భారీ మెజారిటీతో టిడిపికి అనుకూలంగా తీర్పుచెప్పారన్నారు. 151సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పనికిమాలిన సిఎం జగన్ అని, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఒకటే స్లోగన్, సైకోపోవాలి...సైకిల్ రావాలి అన్నారు. ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ని జగన్ దుర్వినియోగం చేశాడని, ఏపీ రాజధానితో మూడు ముక్కలాట ఆడిన జగన్ కు మూడు మొట్టికాయలతో బుద్ది చెప్పారన్నారు.
ఇచ్చిన ఒక్క చాన్స్ ను దుర్వినియోగం చేశాడు..
మైండ్ ఉన్న ఎవడైనా సింగపూర్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారని, సిఎం మాత్రం ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నాడని, ఏ సిఎం అయినా అభివృద్ధి పనులతో పాలన ప్రారంభిస్తారు. సైకో సిఎం ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడని లోకేష్ విమర్శించారు. ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ని మిస్ యూజ్ చేసుకున్న ఫెయిల్డ్ సీఎం జగన్ అన్నారు.
మూడు రాజధానులు అంటూ మాయ చెయ్యాలని చూశాడని, ఒక్క ఇటుక పెట్టలేదని ఇప్పుడు మూడు ప్రాంతాల ప్రజలు జగన్ కి మూడు మొట్టికాయలు వేసారన్నారు. సీఎం అయిన తరువాత ఎవరైనా మొదట చేసే పని పరిశ్రమలు తీసుకురావడం చేస్తారని, ఫెయిల్డ్ సీఎం కథ వేరని ఈయన సీఎం అయిన వెంటనే పీపీఏ లు రద్దు చేసి ఉన్న కంపెనీలను తరిమేసాడన్నారు. సీఎం అయ్యాక ఎవరైనా అభివృద్ధి, సంక్షేమం లో పోటీపడతారని ఫెయిల్డ్ సీఎం జగన్ మాత్రం కేవలం ప్రతిపక్షం పై కక్ష సాధింపు ఎజెండా గా పెట్టుకున్నాడన్నారు. తాను ఏనాడు జగన్ తల్లి, భార్య, బిడ్డల గురించి మాట్లాడలేదని తన తల్లిని వైసిపినేతలు అసెంబ్లీ సాక్షిగా అవమానించారని, అమ్మను అవవమానించిన వారిని ఊరికే వదలను కట్ డ్రాయర్ పై ఊరేగిస్తానన్నారు. నేను రాముడ్ని కాదు... వడ్డీతో సహా చెల్లిస్తానని లోకేష్ శపథం చేశారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారం కదిరి నియోజక వర్గంలో సాగనుంది.
8.00 – జోగన్నపేట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
8.45 – మోటుకుపల్లి వద్ద అనాధలతో మాటామంతీ.
10.20 – మోటుకుపల్లి పివిఆర్ గ్రౌండ్ లో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.
11.20 – మోటుకుపల్లిలో భోజన విరామం.
2.20 – మోటుకుపల్లి భోజన విరామస్థలంలో ముస్లింలతో ముఖాముఖి.
సాయంత్రం
4.20 – కదిరి ఇక్బాల్ సర్కిల్ (జీవమాను సర్కల్) లో స్థానికులతో మాటామంతీ.
4.45 – కదిరి ఎంజి రోడ్డులో జ్యుయలరీ షాపు యజమానులతో భేటీ.
5.00 – కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు.
7.10 – కదిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద విడిది కేంద్రంలో బస చేస్తారు.