Nara Lokesh Yuvagalam :ఫేక్ సమ్మిట్‌ మోసాలు బయట పెడతానన్న నారా లోకేష్-tdp general secretary nara lokesh fires on cm jagan mohan reddy and ycp government failures ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp General Secretary Nara Lokesh Fires On Cm Jagan Mohan Reddy And Ycp Government Failures

Nara Lokesh Yuvagalam :ఫేక్ సమ్మిట్‌ మోసాలు బయట పెడతానన్న నారా లోకేష్

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 05:35 AM IST

Nara Lokesh Yuvagalam విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్ అసలు నిజాలు బయటపెడతానని నారాలోకేష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని... లోకల్ ఫేక్ సమ్మిట్ అని టిడిపి నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర 35వరోజు పీలేరులోకి ప్రవేశించింది.

పీలేరులో సాగుతున్న  నారా లోకేష్ యువగళంయాత్ర
పీలేరులో సాగుతున్న నారా లోకేష్ యువగళంయాత్ర

Nara Lokesh Yuvagalam విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవాళ్లు గిఫ్టులకోసం కొట్టుకున్నారని, కాగితాల్లేకుండా ఫేక్ ఎంఓయులు చేసుకున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు

సోమాలియా లో కూడా భోజనం, గిఫ్టుల కోసం అలా కొట్టుకోరని, దీనిని ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంటారా అని ప్రశ్నించారు. ఇండోసోల్ అనే కడపకు చెందిన జగన్ బినామీ కంపెనీ రూ.76వేలకోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారని, ఆ కంపెనీ పేరుతో 25వేల ఎకరాల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. నెట్ లో చూస్తే ఆ కంపెనీ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ కేవలం లక్ష రూపాయలు మాత్రమేనని బయటపడిందన్నారు.

సిరాంటికా అనే ఐటి కంపెనీలో 50మంది మాత్రమే పనిచేస్తున్నారని ఆ కంపెనీ 8వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఆరోపించారు. ఏబీసీ మరో ఊరుపేరులేని కంపెనీ 1.50లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందని విమర్శించారు. ఫేక్ సమ్మిట్ పై అసలు వాస్తవాలు బయట పెడతానన్నారు.

చంద్రబాబు పాలనలో తెచ్చిన లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫాక్స్ కాన్, అమర్ రాజా వంటి పెద్దపెద్ద కంపెనీలను జే ట్యాక్స్ కోసం తరిమేసి...ఫేక్ కంపెనీలతో పెట్టుబడులు పెడుతున్నామంటూ అబద్దాలు చెప్పిస్తున్నారన్నారు. విజనరీకి, ప్రిజనరీకి చాలా తేడా ఉందని, టీడీపీ పాలనలో పెట్టుబడులు వెల్లువెత్తాయని వైసీపీ అధికారంలోకి వచ్చిన 4ఏళ్ల వరకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రాలేదన్నారు.

35వ రోజుకు యువగళం పాదయాత్ర…

టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర 35వ రోజు పీలేరు నియోజక వర్గంలోకి ప్రవేశించింది. జ్యోతినగర్ విడిది కేంద్రం నుంచి 35వరోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆకస్మికంగా కన్నుమూసిన ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీలేరు బహిరంగసభ అనంతరం పట్టణంలో నిర్వహించిన పాదయాత్రకు జనం భారీగా హాజరయ్యారు.

ప్రధాన రహదార్లవెంట జనం కిక్కిరిసిపోవడంతో పీలేరు పట్టణం జనసంద్రంగా మారింది. యువగళం పాదయాత్ర 35వరోజు ఉత్సాహ పూరిత వాతావరణంలో సాగింది. నారా లోకేష్‌ని చూసేందుకు రోడ్లవెంట మహిళలు, యువకులు పోటెత్తారు. పీలేరు పట్టణంలో యువనేతపై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. బాణా సంచా మోతలు, డప్పు శబ్ధాలతో పీలేరు హోరెత్తింది.

జ్యోతినగర్ విడిది కేంద్రం నుండి ప్రారంభమైన 35 వ రోజు యువగళం అగ్రహారం క్రాస్ వద్ద పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో ప్రవేశించింది. పీలేరు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టిడిపి నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి కాదు...మోసాల రెడ్డి!

మాటతప్పి, మడమతిప్పే జగన్ పేరు ఇకపై ఫేక్ మోహన్ రెడ్డి అని నారా లోకేష్ విమర్శించారు. పాదయాత్ర సమయంలో యువతకు డ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చారని, ఉద్యోగాలు మాత్రం సున్నా అన్నారు. 2.30లక్షల ఖాళీ ఉద్యోగాల భర్తీ సున్నా అని, మెగా డీఎస్సీ నిర్వహణ సున్నా అన్నారు. జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రిగా నిలిచాడన్నారు.

2024లో చంద్రబాబు సీఎం అయ్యాక 2025 నుంచి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ఇచ్చి మోసం చేశాడన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్ రెడ్డి హామీ ఇచ్చి వీధి వీధికీ బెల్టు షాపులు పెట్టి కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నాడని, జగన్ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్నాడని, సీపీఎస్ రద్దు చేస్తానని మోసం చేశాడన్నారు. కనీసం ప్రతినెలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చివరకు పోలీసులు కూడా జగన్ పాలనలో బాధితులుగా మారారన్నారు .4సరెండర్లు, 8టీఏ, డీఏ లు పెండింగ్ లో పెట్టాడు. 2024లో అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని సమస్యలు పరిష్కరించేది మేమే అన్నారు.

జగన్ పాలనలో అన్నీ కోతలే…

జగన్ డ్డి ఒక కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్అని అన్న క్యాంటీన్, పండుగ కానుక, పెళ్లి కానుక, ఫీజు రీయింబర్స్మెంట్, చంద్రన్న బీమా ఇలా అనేక కార్య్రమాలను కట్ చేశారని, కరెంటు ఛార్జీలు, పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసరాలు ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఫిటింగ్ మాస్టర్‌గా మారారని, భారతీ సిమెంట్ ధర ఏకంగా రూ.400కు పెంచేశాడన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడని దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు చెప్పారు. తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గంజాయి ఎక్కడా లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడని ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సమయంలోనే చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో గంజాయి దొరికిందన్నారు. చిన్న పిల్లల్ని కూడా వైసీపీ నాయకులు గంజాయికి బానిసలుగా చేస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ పాలనలో గంజాయిని పూర్తిగా అరికట్టామని డీ అడిక్షన్ సెంటర్లను కూడా నిర్వహించామన్నారు. వైసీపీ పాలనలో పదో తరగతి విద్యార్థులను గంజాయి బానిసలుగా చేస్తున్నారని చివరకు వారినే సప్లయర్లుగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువగళం పాదయాత్ర 36వ రోజు పీలేరు నియోజకవర్గంలో కొనసాగనుంది.

ఉదయం

9.00 – పీలేరు శివారు వేపులబయలులో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి. విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – వేపులబయలు నుంచి పాదయాత్ర ప్రారంభం.

11.00 – అంకాళమ్మతల్లి దేవాలయం వద్ద ఉప్పర, సగర సామాజికవర్గీయులతో మాటామంతీ.

12.30 – శివాపురం గ్రామంలో స్థానికులతో భేటీ.

1.05 – తిమ్మిరెడ్డిగారిపల్లిలో భోజన విరామం

సాయంత్రం

3.05 – తిమ్మిరెడ్డిగారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.20 – కొర్లకుంట పట్టికాడ గ్రామంలో స్థానికులతో మాటామంతీ.

4.50 – కలికిరి పంచాయితీ సత్యపురం వద్ద స్థానికులతో భేటీ.

5.15 – కలికిరిలో రైతులతో భేటీ.

5.30 – కలికిరి పంచాయితీ నగిరిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

6.20 – కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద పార్టీలో చేరికలు.

6.30 – కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద విడిది కేంద్రంలో బస చేస్తారు.

IPL_Entry_Point

టాపిక్