AP Chief Minister : జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం..!
Chandrababu Swearing in Ceremony : ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
Chandrababu Swearing in Ceremony as CM : ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముహుర్తం ఫిక్స్ అయింది. ముందుగా జూన్ 9వ తేదీని ప్రాథమికంగా అనుకున్నప్పటికీ తేదీని మార్చారు. తాజా సమాచారం ప్రకారం… జూన్ 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
జూన్ 11వ తేదీన తెలుగుదేశం ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఇందులో ఆ పార్టీ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం ఆ నివేదికను రాష్ట్ర గవర్నర్ కు పంపనున్నారు. అమరావతి వేదికగా 12వ తేదీన ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది.
జూన్ 9వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో ముందుగా నిర్ణయించిన తేదీని టీడీపీ వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 12వ తేదీని ఫిక్స్ చేశారని తెలిసింది. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు పలువురు ఎన్డీయే ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.