CBN Oath Ceremony Live Updates : సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరైన మోదీ, కిక్కిరిసిన ప్రాంగణం-tdp chief chandrababu naidu oath ceremony live updates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Oath Ceremony Live Updates : సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరైన మోదీ, కిక్కిరిసిన ప్రాంగణం

ప్రధాని మోదీతో ఏపీ కేబినెట్

CBN Oath Ceremony Live Updates : సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరైన మోదీ, కిక్కిరిసిన ప్రాంగణం

07:11 AM ISTJun 12, 2024 12:41 PM Maheshwaram Mahendra Chary
  • Share on Facebook

  • Chandrababu Oath Ceremony Live Updates : ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని చూడండి…..

Wed, 12 Jun 202407:11 AM IST

మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ

చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా ప్రధాని మోదీ మాట్లాడారు. చిరంజీవి, పవన్‌ చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు.

Wed, 12 Jun 202406:59 AM IST

మోదీతో కేబినేట్ ఫొటో సెషన్

మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తి తర్వాత… ప్రధాని మోదీతో ఏపీ కేబినెట్ లోని మంత్రులు ఫొటోలు దిగారు.

Wed, 12 Jun 202406:58 AM IST

ముగిసిన ప్రమాణస్వీకారం….

మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తి అయింది.చివరగా జాతీయ గీతాలపానతో కార్యక్రమం ముగిసింది.

Wed, 12 Jun 202406:56 AM IST

ప్రమాణస్వీకారానికి మోదీ

చంద్రబాబుతో పాటు మంత్రుల ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, రామ్మోహన్‌నాయుడు, చిరాగ్‌ పాసవాన్‌తో హాజరయ్యారు.

Wed, 12 Jun 202406:44 AM IST

కమ్మ సామాజికవర్గం నుంచి ఐదు మంది

టీడీపీలో సామాజిక కూర్పు చూస్తే 21 మందిలో ఐదుగురు క‌మ్మ‌, ఒక‌రు కాపు, ఒక‌రు వైశ్య‌, ఒక‌రు ఎస్టీ, ఒక‌రు మైనార్టీ, ఇద్ద‌రు ఎస్సీ, ముగ్గురు రెడ్డి, ఏడుగురు బీసీ సామాజిక‌వర్గాల‌కు చెందిన వారు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

Wed, 12 Jun 202406:43 AM IST

బీజేపీ నుంచి సత్య కుమార్

బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ (బీసీ) మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Wed, 12 Jun 202406:42 AM IST

టీడీపీ నుంచి 21 మంది….

టీడీపీకి 21, జ‌న‌సేన‌కు 3, బీజేపీ 1 మంత్రి ప‌దువుల కేటాయించారు. ఆయా పార్టీల నుంచి మంత్రులుగా ఎంపికైన వారు ప్ర‌మాణ స్వీకారం చేశారు. టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు (ముఖ్య‌మంత్రి ), నారా లోకేష్ (క‌మ్మ‌), కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ), కొల్లు రవీంద్ర (బీసీ), పి.నారాయణ (కాపు), వంగలపూడి అనిత (ఎస్సీ), నిమ్మల రామానాయుడు (క‌మ్మ‌), ఎన్ఎండీ ఫరూక్ (ముస్లీం), ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి), పయ్యావుల కేశవ్ (క‌మ్మ‌), అనగాని సత్యప్రసాద్ (బీసీ), కొలుసు పార్థసారధి (బీసీ), డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ), గొట్టిపాటి రవి (క‌మ్మ‌), గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ), బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి), టీజీ భరత్ (వైశ్య‌), ఎస్.సవిత (బీసీ), వాసంశెట్టి సుభాష్ (బీసీ), కొండపల్లి శ్రీనివాస్ (బీసీ), మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రెడ్డి) మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Wed, 12 Jun 202406:35 AM IST

17 మంది కొత్తవారే…

చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో…. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం లభించింది. ఇందులో ఎనిమిది మంది బీసీలకు అవకాశం దక్కగా… ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎస్టీ సామాజికవర్గానికి ఒకటి, ముస్లిం మైనార్టీ నుంచి ఒకరు, ఎస్సీల నుంచి ఇద్దరికి చోటు కల్పించారు. బీజేపీ నుంచి గెలిచిన సత్య కుమార్ యాదవ్ కు కేబినెట్ బెర్త్ ఖరారైంది.

Wed, 12 Jun 202406:35 AM IST

చంద్రబాబు కేబినెట్ - మంత్రుల పేర్లు

ఉప ముఖ్యమంత్రి - పవన్‌ కల్యాణ్‌(జనసేన)

నారా లోకేశ్

కొల్లు రవీంద్ర

పయ్యావుల కేశవ్

నారాయణ

అచ్చెన్నాయుడు

సత్యకుమార్ యాదవ్(బీజేపీ)

నిమ్మల రామనాయుడు

గొట్టిపాటి రవి కుమార్

బీసీ జనార్థన్ రెడ్డి

టీజీ భరత్

సవిత

సుభాష్

కొండపల్లి శ్రీనివాస్

మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

నాదెండ్ల మనోహర్(జనసేన)

వంగలపూడి అనిత

ఎన్ఎండీ ఫరూక్

ఆనం రామనారాయణరెడ్డి

అనగాని సత్యప్రసాద్

కొలుసు పార్థసారథి

బాల వీరాంజనేయస్వామి

కందుల దుర్గేష్

Wed, 12 Jun 202406:29 AM IST

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణం…

Wed, 12 Jun 202406:24 AM IST

చంద్రబాబు ప్రమాణస్వీకారం వీడియో…

Wed, 12 Jun 202406:14 AM IST

మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణం

లోకేశ్ తర్వాత అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Wed, 12 Jun 202406:11 AM IST

డిప్యూటీ సీఎంగా పవన్

చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. అనంతరం నారా లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేశారు.

Wed, 12 Jun 202406:05 AM IST

సీఎంగా చంద్రబాబు ప్రమాణం

ఏపీ సీఎంగా చంద్రబాబుతో రాష్ట్ర గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.

Wed, 12 Jun 202405:58 AM IST

చేరుకున్న ప్రధాని మోదీ

సభా ప్రాంగణానికి ప్రధాని మోడీ, చంద్రబాబు చేరుకున్నారు.

Wed, 12 Jun 202405:58 AM IST

ఆగిపోయిన గవర్నర్ కాన్వాయ్

గన్నవరం గ్రీన్ ఛానల్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. సభా వేదికకు మూడు కిలో మీటర్ల దూరంలోనే గవర్నర్ కాన్వాయ్ ఆగిపోయింది.

Wed, 12 Jun 202405:54 AM IST

హీరో రామ్ చరణ్ హాజరు

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హీరో రామ్ చరణ్ హాజరయ్యారు.

Wed, 12 Jun 202405:53 AM IST

కాసేపట్లో గవర్నర్

మరో ఐదు నిమిషాల్లో రాష్ట్ర గవర్నర్ వేదిక వద్దకు చేరుకుంటారు.

Wed, 12 Jun 202405:48 AM IST

మోదీకి స్వాగతం

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి చంద్రబాబు స్వాగతం పలికారు.

Wed, 12 Jun 202405:37 AM IST

అమిత్ షా హాజరు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వేదిక వద్దకు చేరుకున్నారు.

Wed, 12 Jun 202405:35 AM IST

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు

చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు.

Wed, 12 Jun 202405:28 AM IST

చిరంజీవి, రజినీకాంత్ హాజరు

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, తమిళ తళైవా, సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. వేదికపై ఆసీనులయ్యారు.

Wed, 12 Jun 202405:19 AM IST

కాసేపట్లో చంద్రబాబు ప్రమాణం

నారా భువనేశ్వరి, నారా బ్రహ్మిణి వేదిక వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Wed, 12 Jun 202405:13 AM IST

చేరుకున్న నారా లోకేశ్

మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నారా లోకేశ్ వేదిక వద్దకు చేరుకున్నారు.

Wed, 12 Jun 202405:06 AM IST

గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చంద్రబాబు

ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీ దిగనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన చంద్రబాబు… మోదీకి స్వాగతం పలకనున్నారు. ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Wed, 12 Jun 202405:04 AM IST

కాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణం

కాసేపట్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Wed, 12 Jun 202404:55 AM IST

సాంస్కృతిక కార్యక్రమాలు…

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Wed, 12 Jun 202404:24 AM IST

భారీగా తరలివస్తున్న అభిమానులు

గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివస్తున్నారు.

Wed, 12 Jun 202404:06 AM IST

భారీగా ట్రాఫిక్ జామ్

చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ దాదాపుగా 5 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నారు. ఈ కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Wed, 12 Jun 202403:41 AM IST

ఉదయం 11.27 గంటలకు ప్రమాణం…

ఉదయం 11.27 గంటలకు కేసరపల్లిలో సీఎంగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు.

Wed, 12 Jun 202403:12 AM IST

దూరంగా వైసీపీ

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ మాత్రం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్య‌క్ర‌మానికి దూరంగా ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రుకావాల‌ని ఎన్‌.చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అయితే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అందుబాటులోకి రాలేద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

Wed, 12 Jun 202403:09 AM IST

జనసేన సామాజిక కూర్పు….

జ‌న‌సేన నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు), నాదెండ్ల మనోహర్ (క‌మ్మ‌), కందుల దుర్గేష్ (కాపు) మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇందులో ఇద్దరు కాపు, ఒకరు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉన్నారు.

Wed, 12 Jun 202403:09 AM IST

టీడీపీ సామాజిక కూర్పు….

టీడీపీలో సామాజిక కూర్పు చూస్తే 21 మందిలో ఐదుగురు క‌మ్మ‌, ఒక‌రు కాపు, ఒక‌రు వైశ్య‌, ఒక‌రు ఎస్టీ, ఒక‌రు మైనార్టీ, ఇద్ద‌రు ఎస్సీ, ముగ్గురు రెడ్డి, ఏడుగురు బీసీ సామాజిక‌వర్గాల‌కు చెందిన వారు.

Wed, 12 Jun 202403:09 AM IST

మంత్రి పదవి ఆశించిన నేతలు

జ‌న‌సేన కూడా సీనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేదు. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో కొణ‌తాల రామ‌కృష్ణ (బీసీ), ప‌శ్చిమ గోదావ‌రి నుంచి బొలిశెట్టి శ్రీ‌నివాస‌రావు (కాపు) ఉన్నారు. వీరిలో కొణ‌తాల రామ‌కృష్ణ గ‌తంలో మంత్రిగా చేశారు. అలాగే బొలిశెట్టి శ్రీ‌నివాస్‌ కూడా సీనియ‌ర్ నేత‌గా ఉన్నారు. వీరిద్ద‌రికీ మంత్రి ప‌దవులు ద‌క్క‌లేదు.

Wed, 12 Jun 202403:08 AM IST

సీనియర్లకు దక్కని చోటు

టీడీపీకి 21, జ‌న‌సేన‌కు 3, బీజేపీ 1 మంత్రి ప‌దువుల కేటాయించారు. ఆయా పార్టీల నుంచి మంత్రులుగా ఎంపికైన వారు నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అయితే సీనియ‌ర్ల‌కు మాత్రం మొండి చెయ్యే ద‌క్కింది. మూడు పార్టీల్లో సీనియ‌ర్ నేత‌లుగా ఉన్నవారికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేదు.

Wed, 12 Jun 202402:42 AM IST

ఆ ఇద్దరికి చోటు

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రాంనారాయణరెడ్డితో పాటు కొలుసు పార్థసారథికి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కింది.

Wed, 12 Jun 202402:38 AM IST

బీజేపీ నుంచి ఒక్కరే…!

బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు కేబినెట్ లో చోటు దక్కింది.

Wed, 12 Jun 202402:37 AM IST

జనసేన నుంచి మంత్రులు

కొణిదెల పవన్ కళ్యాణ్

నాదెండ్ల మనోహర్

కందుల దుర్గేష్ గారు

Wed, 12 Jun 202402:37 AM IST

టీడీపీ నుంచి మంత్రులు…..

డోలా బాలవీరాంజనేయస్వామి(కొందేపి - SC)

గొట్టిపాటి రవి(పర్చూరు - OC)

గుమ్మడి సంధ్యారాణి(సాలూరు - ST)

బీసీ జనార్థన్ రెడ్డి(బనగానపల్లె-OC)

టీజీ భరత్(కర్నూలు -OC- వైస్య)

ఎస్.సవిత(పెనుకొండ - OC)

వాసంశెట్టి సుభాష్(రామచంద్రాపురం -BC)

కొండపల్లి శ్రీనివాస్(గజపతినగరం - BC)

మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి(రాయచోటి - OC)

నారా లోకేష్(మంగళగిరి - OC)

Wed, 12 Jun 202402:37 AM IST

సీఎంగా చంద్రబాబు - కేబినెట్

చంద్రబాబు (కుప్పం - OC)

కింజరాపు అచ్చెన్నాయుడు(టెక్కలి - బీసీ)

కొల్లు రవీంద్ర(మచిలీపట్నం - బీసీ)

నారాయణ(నెల్లూరు సిటీ - OC )

వంగలపూడి అనిత(పాయకరావ్ పేట - SC)

నిమ్మల రామానాయుడు(పాలకొల్లు - OC )ఎన్.ఎమ్.డి.ఫరూక్(నంద్యాల - ముస్లిం మైనారిటీ)

ఆనం రామనారాయణరెడ్డి(ఆత్మకూరు - OC)

పయ్యావుల కేశవ్(ఉరవకొండ - OC)

అనగాని సత్యప్రసాద్(రేపల్లె - బీసీ)

కొలుసు పార్థసారధి(నూజివీడు - BC)

Wed, 12 Jun 202402:37 AM IST

ఏపీ కేబినెట్ - సామాజిక వర్గాల వారీగా

ఏపీ కేబినెట్ లో 13 మంది ఓసీలకు చోటు దక్కింది. ఎస్సీలకు ఇద్దరికి ఛాన్స్ దక్కింది.

ఓసీ - 13

బీసీ - 7

ఎస్సీ -2

ఎస్టీ - 1

మైనారిటీ - 1

Wed, 12 Jun 202402:35 AM IST

కేంద్రంలోనూ మంత్రి పదవులు

ఇక పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే మొత్తం 25 స్థానాలకుగాను టీడీపీ 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.కూటమిలో ఉన్న జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రం నుంచి మెజార్టీ గెలుచుకున్న టీడీపీ…. అటు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ అవతరించింది. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరికి, బీజేపీ నుంచి ఒకరికి కేంద్ర కేబినెట్ లో కూడా చోటు దక్కింది.

Wed, 12 Jun 202402:35 AM IST

కూటమి బంపర్ విక్టరీ

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Wed, 12 Jun 202402:35 AM IST

బీజేపీ నుంచి సత్యకుమార్ కు అవకాశం

ఇక జనసేన పార్టీ నుంచి మంత్రివర్గంలో ముగ్గురికి బెర్త్ లు ఖరారయ్యాయి. పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో గెలిచిన పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇక పార్టీలో సీనియర్ నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ కు కూడా ఛాన్స్ దక్కింది. ఇదే పార్టీ నుంచి గెలిచిన కందుల దుర్గేష్ కు కూడా బెర్త్ ఖరారైంది. ఇక బీజేపీ నుంచి గెలిచిన సత్య కుమార్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

Wed, 12 Jun 202402:35 AM IST

17 మంది కొత్తవారే…..

చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు అవుతున్న కొత్త ప్రభుత్వంలో…. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం లభించింది. ఇందులో ఎనిమిది మంది బీసీలకు అవకాశం దక్కగా… ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎస్టీ సామాజికవర్గానికి ఒకటి, ముస్లిం మైనార్టీ నుంచి ఒకరు, ఎస్సీల నుంచి ఇద్దరికి చోటు కల్పించారు. బీజేపీ నుంచి గెలిచిన సత్య కుమార్ యాదవ్ కు కేబినెట్ బెర్త్ ఖరారైంది.

Wed, 12 Jun 202402:35 AM IST

ఏపీ కేబినెట్ లిస్ట్ :

ముఖ్యమంత్రి - చంద్రబాబు నాయుడు

ఉప ముఖ్యమంత్రి - పవన్‌ కల్యాణ్‌(జనసేన)

నారా లోకేశ్

కొల్లు రవీంద్ర

పయ్యావుల కేశవ్

నారాయణ

అచ్చెన్నాయుడు

సత్యకుమార్ యాదవ్(బీజేపీ)

నిమ్మల రామనాయుడు

గొట్టిపాటి రవి కుమార్

బీసీ జనార్థన్ రెడ్డి

టీజీ భరత్

సవిత

సుభాష్

కొండపల్లి శ్రీనివాస్

మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

నాదెండ్ల మనోహర్(జనసేన)

వంగలపూడి అనిత

ఎన్ఎండీ ఫరూక్

ఆనం రామనారాయణరెడ్డి

అనగాని సత్యప్రసాద్

కొలుసు పార్థసారథి

బాల వీరాంజనేయస్వామి

కందుల దుర్గేష్

Wed, 12 Jun 202402:34 AM IST

జనసేన నుంచి ముగ్గురికి ఛాన్స్

చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్‍ కు బెర్త్ ఖరారైంది. మిగతా వారంతా కూడా టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు.

Wed, 12 Jun 202402:34 AM IST

డిప్యూటీ సీఎంగా పవన్

నేడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వీరితో పాటే మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. మొత్తం 24 బెర్త్ లను ఖరారు చేశారు.

Wed, 12 Jun 202402:28 AM IST

భారీ బందోబస్తు

ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖులు గన్నవరం మార్గంలో ప్రయాణం చేస్తారు. కాబట్టి ట్రాఫిక్ పరంగా భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన బందోబస్త్ ఏర్పాట్లు చేశామని కమిషనర్ తెలిపారు. పాసులు కలిగిన ఆహ్వానితులు సభా స్థలానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Wed, 12 Jun 202402:28 AM IST

భారీ ఎల్ఈడీ స్క్రీన్లు

విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, అంబేడ్కర్ విగ్రహం వద్ద, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, లెనిన్ సెంటర్, పటమటలోని జెడ్.పి.బాయ్స్ హై స్కూల్, అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, జింకానా గ్రౌండ్స్ , విధ్యధరపురం మినీ స్టేడియం ప్రాంతాలలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రామాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

Wed, 12 Jun 202402:28 AM IST

పాసులు ఉండాల్సిందే….

విజయవాడ రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం వైపునకు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి వెళ్లే వాహనాలు, అంబుల్లెన్లు , అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాలు తప్ప మరి ఏ ఇతర వాహనాలను గన్నవరం వైపునకు అనుమతించరు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ట్రాఫిక్ మళ్లిoపునకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.

Wed, 12 Jun 202402:28 AM IST

ఆర్టీసీ బస్సుల రూట్…

విజయవాడ ఏలూరు వైపునకు వెళ్లే బస్సులు విజయవాడ బస్ స్టేషన్ నుంచి ఓల్డ్ PCR జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపు మార్గంలో వెళ్లాలి.

Wed, 12 Jun 202402:27 AM IST

ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపునకు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలను ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిలు నుంచి కంకిపాడు-పామర్రు-హనుమాన్ జంక్షన్-ఏలూరు వైపునకు మళ్లిస్తారు.

Wed, 12 Jun 202402:27 AM IST

వాహనాల మళ్లింపు

సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు వీవీఐపీలు, గవర్నర్, ముఖ్య నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశము ఉండడంతో విజయవాడ నుంచి గన్నవరం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. ఈ మేరకు ఎన్డీఆర్ జిల్లా పోలీసులు ప్రకటన చేశారు.

Wed, 12 Jun 202402:27 AM IST

విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు.ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు.

Wed, 12 Jun 202402:26 AM IST

భారీ ఏర్పాట్లు

చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం గన్నవరం మండలం కేసరపల్లిలో సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు. 36 గ్యాలరీల్లో అందరికీ వేదిక కనిపించేలా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటుచేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు

Wed, 12 Jun 202402:26 AM IST

ప్రధాని రాక

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు..

Wed, 12 Jun 202402:25 AM IST

నేడే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.