Chandrababu: MLC ఫలితాలతో వైసీపీకి నిద్రపట్టడం లేదు... తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయట -tdp chief chandrababu fires on ysrcp govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Chief Chandrababu Fires On Ysrcp Govt

Chandrababu: MLC ఫలితాలతో వైసీపీకి నిద్రపట్టడం లేదు... తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయట

HT Telugu Desk HT Telugu
Mar 24, 2023 08:26 PM IST

chandrababu on ycp govt: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది టీడీపీనే అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను నాశనం చేసిన చరిత్ర జగన్ దే అని మండిపడ్డారు.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Fires On CM Jagan: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు చంద్రబాబు. టీడీపీ విజయాన్ని ఆపలేరని అన్నారు. శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన టీడీపీ జోన్‌-3 సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సైకో పాలన పోవాలి .. సైకిల్ పాలన రావాలని పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది ప్రజలు టీడీపీ రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలంతా తిరుబాటుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

రాజీలేని పోరాటం చేసిన పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలిచారని చంద్రబాబు అన్నారు. ఎన్నో అనుమానాలను భరించి కూడా పార్టీ తరపున నిలబడ్డారని కొనియాడారు.. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు... అనురాధ గెలుపే వైసీపీకి ఓ సమాధానమని అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని... రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.వైసీపీ పాలనతో 30 ఏళ్లు వెనక్కి వచ్చామని... అవినీతి పెరిగిపోయిందన్నారు.

పోలవరం కుడి కాలువ, పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే ఎగతాళి చేశారని.. కానీ పూర్తి చేసి చూపించిన చరిత్ర టీడీపీది అన్నారు చంద్రబాబు. పోలవరం పనులు పరుగెత్తించాంని... 2020 జూన్ వరకు నీళ్లు ఇవ్వాలని అనుకున్నామని చెప్పారు. కానీ జగన్ అధికారంలోకి రావటంతో ప్రాజెక్ట్ పనులన్నీ ఆగిపోయాయని ఆరోపించారు. అవినీతి అంటూ విచారణల పేరుతో కాలయాపన చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ తన మానసపుత్రిక అని... అలాంటి ప్రాజెక్ట్ ను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ఇవాళ కాఫర్ డ్యామ్ లు దెబ్బతినే పరిస్థితికి వచ్చిందని... ఎత్తును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పోలవరం పూర్తి చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు చంద్రబాబు.

వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని... సంక్షేమ పథకాలు కూడా లేవన్నారు చంద్రబాబు. తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ లో ఏదో జరుగుతందని మాట్లాడుతున్నారని... లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మెహన్ రెడ్డిని ఓడించాలని... టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

మరోవైపు ఇవాళ చంద్రబాబు సమక్షంలో నెల్లూరుజిల్లాకు చెందిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరారు. గిరిధర్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.... వాళ్ల పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే ఓట్లు వేయని పరిస్థితి వైసీపీలో ఉందన్నారు. జగన్ చతికిలపడిపోయారని... తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగిలిపోతున్నాయంటూ కామెంట్స్ చేశారు. గ్రాడ్యూయేట్ ఫలితాల్లో వైసీపీకి వణుకుపుట్టిందని...తాజా ఎమ్మెల్సీ ఫలితం చూశాక... నిద్రపట్టడం లేదన్నారు. మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని పోటీ చేసే అర్హత టీడీపీకి లేదనటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలిందన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం