TDP - Janasena : ప్రభుత్వ హామీతో ఆడబిడ్డలకు రుణాలు, ఉమెన్స్ డే వేళ టీడీపీ సరికొత్త హామీ - వెబ్ సైట్ కూడా ప్రారంభం-tdp chief chandrababu announces kalalaku rekkalu scheme for girls on international womens day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Chief Chandrababu Announces Kalalaku Rekkalu Scheme For Girls On International Womens Day.

TDP - Janasena : ప్రభుత్వ హామీతో ఆడబిడ్డలకు రుణాలు, ఉమెన్స్ డే వేళ టీడీపీ సరికొత్త హామీ - వెబ్ సైట్ కూడా ప్రారంభం

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 08, 2024 08:50 PM IST

TDP Janasena Kalalaku Rekkalu Scheme: ఉమెన్స్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొత్త హామీ ప్రకటించారు. ఆడబిడ్డల కోసం కలలకు రెక్కలు కార్యక్రమం తీసుకువస్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పట్నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ట్వీట్ చేశారు.

టీడీపీ సరికొత్ హామీ
టీడీపీ సరికొత్ హామీ (https://kalalakurekkalu.com/)

TDP Kalalaku Rekkalu Scheme: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త స్కీమ్ ను ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్ చేశారు చంద్రబాబు.

ట్రెండింగ్ వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(Womens Day) సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగమన్నారు. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం తెలుగుదేశం పార్టీ పని చేసిందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.

“నేడు మళ్లీ మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తాం. అలాగే ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మన ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదు అన్న ఆశయంతో, 'కలలకు రెక్కలు(TDP Janasena Kalalaku Rekkalu Scheme)' అనే పథకాన్ని మన ప్రభుత్వం వచ్చాక అమలుచేయబోతున్నాం. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి ఋణం పై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కలలకు రెక్కలు పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. అందుకోసం https://kalalakurekkalu.com వెబ్ సైట్ కు వెళ్ళండి. మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు... మన ఆడబిడ్డలు బాగుండేలా చూడడం. మీ అందరి మద్దతుతో త్వరలో ఏర్పడే టీడీపీ - జనసేన ప్రభుత్వంలో మీకు అభివృద్ధి, స్వేచ్చ, భద్రత కల్పిస్తాం అని మాట ఇస్తూ....మరోసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అని ట్విట్టర్(X)లో చంద్రబాబు(Chandrababu Tweet) పోస్ట్ చేశారు.

ఈ నెల 17న కూటమి మేనిఫెస్టో…

TDP - Janasena Manifesto : తెలుగుదేశం-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ఈ నెల 17న ప్రకటించనున్నారు. చిలకలూరిపేట వద్ద 10 లక్షల మంది ప్రజల సమక్షంలో విడుదల చేస్తామని ఇరు పార్టీలు గురువారం నాడు ప్రకటించాయి. టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన పొలిటి కల్‌ అఫైర్స్‌ కమిటీి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నిన్న తెదేపా కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన సూపర్‌-6 పథకాలపై ఇరు పార్టీల అగ్రనేతలు ఆ సభలో కొన్నికీలక ప్రకటనలుచేస్తారని అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. తెదేపా, జనసేన పార్టీలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్లు చేసి మరీ బైండోవర్‌ కేసులు పెడతామని బెదిరి స్తున్నారని, ఈ దమనకాండపై సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు చేసేందుకు తెదేపా ఒక కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసిందని, సమాచారం అందిన వెంటనే పార్టీ యంత్రాంగం తగు సహాయక చర్యలు చేపడుతుందని అచ్చెన్నాయుడు వివరించారు. పోలీసు బాధితులు 7306299999 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

IPL_Entry_Point