విశాఖలో టీసీఎస్‌ క్యాంపస్‌.. 21 ఎకరాల భూమి కేటాయింపు క్యాబినెట్ అమోదం-tcs campus in visakhapatnam cabinet approves allocation of 21 acres of land ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖలో టీసీఎస్‌ క్యాంపస్‌.. 21 ఎకరాల భూమి కేటాయింపు క్యాబినెట్ అమోదం

విశాఖలో టీసీఎస్‌ క్యాంపస్‌.. 21 ఎకరాల భూమి కేటాయింపు క్యాబినెట్ అమోదం

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక సంస్థల్ని ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసులు ముందుకు రావడంతో 21 ఎకరాలను కేటాయించేందుకు క్యాబినెట్ అమోదం తెలిపింది.

విశాఖపట్నం టీసీఎస్‌ క్యాంపస్‌కు 21 ఎకరాల భూ కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమల్ని ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ఐటీ ఆధారిత పరిశ్రమల్ని ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్‌ ప్రయత్నించారు. దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధుల్ని కలిసి ఏపీలో కార్యకలాపాలను నిర్వహించేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో టాటా కన్సల్టెన్సీ ఛైర్మన్‌తో స్వయంగా పలుమార్లు చర్చలు జరిపారు.

ఏపీ ప్రభుత్వ ఆహ్వానంతో రాష్ట్రంలో ఐటీ ఆధారిత పరిశ్రమల్ని ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రతిపాదనలతో టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ ముందుకు వచ్చయింది. విశాఖపట్నంలోని ఐటి హిల్ నం.3లో రూ.1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడులతో దాదాపు 12వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రాష్ట్రంలో ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమలను ఆకర్షించేందుకు టాటా కన్సల్టెన్సీ ముందుకు రావడంతో టీసీఎస్‌ లిమిటెడ్‌కి మొత్తం 21.16 ఎకరాల భూమి కేటాయించాలని చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎకరాకు 99పైసల ధరకే భూమిని కేటాయించారు.

స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ జులై 2024 నుండి ఐదుసార్లు సమావేశమై రాష్ట్రంలో వ్యాపారనుగుణ వాతావరణ వేగాన్ని పెంచేందుకు పలు చర్యలు చేపట్టింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డు ద్వారా రూ. 4.62 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఇప్పటి వరకు అమోదం లభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులు చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా ఏప్రిల్‌ 10వ తేదీన జరిగిన బోర్డులో చేసిన తీర్మానాలకు అనుగుణంగా భూముల పలు సంస్థలకు భూ కేటాయింపులకు క్యాబినెట్ అమోదం తెలిపింది. పెట్టుబడులు, సమగ్ర ప్రాజెక్టులతో ముందుకు వచ్చే సంస్థలకు వాటికి అవసరమైన భూముల కేటాయింపు, సక్రమంగా ఆమోదించడం,మౌలిక వసతులను కల్పించడం మరియు సంబంధిత విధి విధానాల ప్రకారం ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీని విస్తరించడం వంటి అంశాలపై పరిశ్రమలు, వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదించింది.

విజయనగరంలో మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా సమగ్ర ఉక్కు ప్లాంట్ విస్తరణ, శ్రీసిటీ తిరుపతిలో ప్రొటేరియల్ లిమిటెడ్ ద్వారా అమోర్ఫస్ మెటల్ తయారీ సదుపాయం ఏర్పాటు,విశాఖపట్నంలో అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డేటా సెంటర్ మరియు ఐటి కార్యాలయ స్థలం మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ద్వారా కొత్త ఐటి క్యాంపస్ కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం లభించింది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం