JC Prabhakar Reddy:పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు,ఆ రోజు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా?-జేసీ ప్రభాకర్ రెడ్డి-tadipatri jc prabhakar reddy sensational comments on ysrcp perni nani on ration rice allegations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jc Prabhakar Reddy:పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు,ఆ రోజు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా?-జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy:పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు,ఆ రోజు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా?-జేసీ ప్రభాకర్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Dec 29, 2024 03:37 PM IST

JC Prabhakar Reddy On Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. పేర్ని నానిని మాత్రం వదిలిపెట్టమన్నారు.

పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు,ఆ రోజు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా?-జేసీ ప్రభాకర్ రెడ్డి
పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు,ఆ రోజు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా?-జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy On Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అన్నారు. పేర్ని నానికేనా భార్యపిల్లలు, మాకు లేరా అని ప్రశ్నించారు. పేర్ని నాని రవాణా మంత్రిగా ఉన్నప్పుడు జేసీ ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని దెబ్బతీయడానికి తనతో పాటు పాటు తన భార్య ఉమారెడ్డిపై 12 కేసులు పెట్టారని, ఆ కేసుల వివరాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీ ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..."నీ కుటుంబం గురించి చెబితే ఉరి వేసుకుంటావ్..పేర్ని నానికి ఆడవాళ్లంటే గౌరవం ఉందా? మా మీద కేసులు పెట్టినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచివాళ్లు కాబట్టే ఊరికే ఉన్నారు. నువ్వు తప్పు చేశావ్ కాబట్టే నీ మొహంలో రక్తం చుక్కలేదు" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

yearly horoscope entry point

కేసులతో కూటమి ప్రభుత్వం తమను వేధిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు తమ ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు, పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై మాట్లాడినప్పుడు ఈ సభ్యత ఏమైందని కౌంటర్ ఇచ్చారు. తన తప్పులు లేని రోజున గడ్డం తీసేస్తానని, అందుకే తాను గడ్డం పెంచుతున్నానన్నారు. సీఎం చంద్రబాబు దేవుడు కాబట్టి వైసీపీ నేతలు ఇవాళ బయటికి వస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మమ్మల్ని బయటికి రానివ్వలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై తప్పుడు కేసులు పెట్టినా ధైర్యంగా జైలుకు వెళ్లారన్నారు. ఇప్పుడు పేర్ని నాని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు. పేర్ని నాని లాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబును కోరుతున్నానన్నారు.

నిన్ను మాత్రం వదిలేది లేదు

"పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు. ఇంటికొచ్చి కొట్టినా అడిగే దిక్కు లేదు. నీకు సంస్కారం లేదు. ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తాం" అని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నిన్న ప్రెస్ మీట్ లో పేర్ని నాని ముఖంలో నెత్తుడి చుక్క కూడా లేదన్నారు. తమపై అక్రమంగా కేసులు పెట్టినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు సభ్యత గుర్తుకు రాలేదా? పవన్ కళ్యాణ్ గురించి ఎంత నీచంగా మాట్లాడారో మర్చిపోయారా? వాళ్లు మంచోళ్లు కాబట్టి ఊరికే ఉన్నారన్నారు. చంద్రబాబు మంచి తనంతో మా చేతులు కట్టేశారన్నారు.

పేర్ని నాని, బినామీలకు చుక్కలు చూపిస్తాం - మంత్రి కొల్లు రవీంద్ర

చట్టం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పేదల బియ్యం తినేసి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. భార్య పేరుతో గిడ్డంగి ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పేర్ని నాని... తన భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. చోరీ చేసి డబ్బు తిరిగిచ్చేస్తే దొర అయిపోరన్నారు. దొంగే దొంగ అన్నట్లు పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పేర్ని నాని, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామన్నారు. పేర్ని నాని అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తామన్నారు. బందర్ పోర్టు సమీపంలోని ప్రజల భూములను లాక్కోవడం వాస్తవం కాదా అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.

Whats_app_banner

సంబంధిత కథనం