Pawan Kalyan : వైసీపీకి 24 పవర్ చూపిస్తాం, జగన్ నా నాలుగో భార్య ఏమో?- పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు
Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 24 పవర్ చూపిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. తన పెళ్లిళ్లపై విమర్శలు చేస్తున్న సీఎం జగన్ తన నాలుగో భార్య ఏమో తెలీదు అంటూ ఎద్దేవా చేశారు.
Pawan Kalyan : టీడీపీ, జనసేన కూటమి(TDP Janasena) విజయానికి స్ఫూర్తిగా తాడేపల్లిగూడెం సభకు జెండా అని పేరుపెట్టామని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. జనసేన 24 స్థానాల్లోనే పోటీ చేయడంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి 24 పవర్ తెలియడంలేదన్నారు. బలిచక్రవర్తి వామనుడిని చూసి ఇంతేనా అంటూ హేళన చేశాడని, నెత్తిమీద తొక్కుతుంటే తెలిసింది వామనుడి బలం అన్నారు. వైసీపీకి వామనుడి పవర్ చూపిస్తామన్నారు. తన పెళ్లిళ్లపై సీఎం జగన్(CM Jagan) చేస్తు్న్న విమర్శలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. తన నాలుగో భార్య జగన్ ఏమో నాకు తెలీదు అంటూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ భార్యను భారతి గారు అని మేము మర్యాదిస్తామని, ఆయన మాత్రం మా భార్యల్ని పెళ్లాలు అని సంబోధిస్తున్నారన్నారు. అదే మాట మిమ్మల్ని అంటే ఏమంటారు భారతి గారు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
మక్కెలు విరగొట్టి మడత పెడతాం
ఏపీ రోడ్లపై వెళ్లాలంటే గంటలు కాదు రోజులు గడిచిపోతుదన్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. 5 కోట్ల ప్రజల్ని ఐదుగురు రెడ్ల కోసం తిప్పలు పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ జిల్లాలోనైనా ఈ ఐదురుగే పంచాయితీ చేస్తున్నారన్నారు. మిగతా వైసీపీ నాయకులకు ఎలాంటి హక్కులు లేవన్నారు. రానున్న 45 రోజుల్లో వైసీపీ... టీడీపీ, జనసేన లక్ష్యంగా దాడులు చేస్తుందని, ఆ దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. వైసీపీ గూండాలు టీడీపీ, జనసేన నాయకులను ఇబ్బంది పెడితే మక్కెలు విరగొట్టి మడత మంచంలో పడుకోబెడతామని పవన్ హెచ్చరించారు.
నా నిర్ణయాలు రాష్ట్ర లబ్దికోసమే
4 దశాబ్దాల రాజకీయ ఉద్దండుడైన చంద్రబాబును జైలులో పెడితే బాధ కలిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అన్నారు. తాను ఒక్కడినే అని చెప్పుకుంటున్న సీఎం జగన్ తనకున్న ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పట్నుంచి జగన్ బతుకు తనకు తెలుసన్నారు. తన నిర్ణయాలు పార్టీ, వ్యక్తిపరంగా ఉండవని, రాష్ట్ర లబ్ధికోసమే ఉంటాయన్నారు. టీడీపీ-జనసేన సహకరించుకుంటూనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు. కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా వాటిని వదులుకుని ప్రజల భవిష్యత్తు కోసం వచ్చాన్నారు. సినిమాల్లో వచ్చే డబ్బును ఇంట్లో బియ్యం కొనకుండా, హెలికాప్టర్లకు వెచ్చించి ప్రజల కోసం వస్తున్నానని పవన్ అన్నారు. సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు ఇలా ప్రతీ వర్గాన్ని మోసం చేశారన్నారు. అన్ని వర్గాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
సంబంధిత కథనం