AP New Mlcs: శాసన మండలిలో కొత్త సభ్యుల ప్రమాణం, ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్-swearing in of new members in legislative council ramachandraiah and hariprasad as mlcs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Mlcs: శాసన మండలిలో కొత్త సభ్యుల ప్రమాణం, ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్

AP New Mlcs: శాసన మండలిలో కొత్త సభ్యుల ప్రమాణం, ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్

Sarath chandra.B HT Telugu
Jul 22, 2024 12:55 PM IST

AP New Mlcs: ఏపీ శాసన మండలిలో కొత్త సభ్యులు ప్రమాణం చేశారు. టీడీపీ సభ్యుడిగా రామచంద్రయ్య, జనసేన తరపున హరిప్రసాద్‌ మండలి ఛైర్మన్ సమక్షంలో ప్రమాణం చేశారు.

ఏపీ శాసన మండలిలో కొత్త సభ్యుల ప్రమాణం
ఏపీ శాసన మండలిలో కొత్త సభ్యుల ప్రమాణం

AP New Mlcs: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో కొత్త సభ్యులు ప్రమాణం చేశారు. కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.

టీడీపీ తరపున సి. రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పిడుగు హరి ప్రసాద్ లతో శాసన పరిషత్తు చైర్మన్ కొయ్యే మోషేను రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ, శాసన పరిషత్తు నియమ నిబంధనల పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేశారు.

ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం. విజయ రాజులు పాల్గొన్నారు.

Whats_app_banner