Supreme On Viveka Murder : వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం సీరియస్
Supreme Court On YS Viveka Murder : వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎందుకు ఆలస్యం అవుతుందని దర్యాప్తు సంస్థను అడిగింది.
వైఎస్ వివేకా హత్యకేసు(YS Viveka Murder Case) విచారణ ఆలస్యంపై సుప్రీం కోర్టు(Supreme Court) సీరియస్ అయింది. దర్యాపు ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించింది. సుప్రీం కోర్టులో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య.. తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంకోవైపు దర్యాప్తు అధికారి బాగానే పని చేస్తున్నారని కోర్టుకు సీబీఐ(CBI) తెలిపింది.
దర్యాప్తు ఆలస్యం మీద అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ పురోగతి మీద సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. కేసు విచారణను దర్యాప్తు అధికారి ఎందుకు పూర్తి చేయడం లేదని సుప్రీం కోర్టు(Supreme Court) ప్రశ్నించింది. ఒకవేళ త్వరగా ముగించలేకపోతే.. వేరే అధికారిని ఎందుకు నియమించకూడదని తెలిపింది. ఈ అంశం మీద సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం తెలుకుని చెప్పాలని సీబీఐ తరఫు లాయర్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మరోవైపు వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. సోమవారం ఈ కేసుకు సంబంధించి.. వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో ఏ 4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని కోర్టులో సవాల్ చేశారు. సీబీఐ అడిగినట్టుగా దస్తగిరి స్టేట్ మెంట్ ఇస్తున్నాడని పిటిషన్ లో తెలిపారు. దాని ఆధారంగానే తమను నేరంలోకి నెడుతున్నారని చెప్పారు.
వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో దస్తగిరిది కీలక పాత్ర అని, అతడికి బెయిల్ ఇవ్వడం సరికాదని భాస్కర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకించాలని చెప్పారు. వివేకా హత్యకు ఉపయోగించిన.. ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరి అని తెలిపారు. దస్తగిరి బెయిల్ సమయంలో సీబీఐ సహకరించిందని ఆరోపించారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్(Dastagiri Bail)ను రద్దు చేయాలని పిటిషన్ లో భాస్కర్ రెడ్డి కోరారు.
సంబంధిత కథనం