Ys Sunitha petition: అవినాష్‌ బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ విచారణ వాయిదా-sunithas petition to cancel avinash reddys bail adjourned ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Sunitha's Petition To Cancel Avinash Reddy's Bail Adjourned

Ys Sunitha petition: అవినాష్‌ బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ విచారణ వాయిదా

HT Telugu Desk HT Telugu
Jun 13, 2023 01:47 PM IST

Ys Sunitha petition: ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ సునీత పిటిషన్‍ను ఈనెల 19కి సుప్రీం కోరక్టు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత, హైకోర్టు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

Ys Sunitha petition: వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటే వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. సునీత పిటిషన్‍పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సునీత స్వయంగా తన వాదనలు వినిపించారు. కేసులో సాంకేతిక అంశాలు ముడిపడిన నేపథ్యంలో లాయర్‍ను నియమించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేశారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ హైకోర్టు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని సునీత ధర్మాసనానికి వివరించారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న సునీత, - ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులను ఎంపీ అదేపనిగా బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇతర నిందితులతో కలిసి ఎంపీ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత ఆరోపించారు. ఎంపీ అవినాష్‍కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోందని, అవినాశ్‍కు అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉందని కోర్టుకు తెలిపారు. సీబీఐ అధికారులపై అవినాష్ తప్పుడు ఫిర్యాదులు చేశారని, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై ఎంపీ ప్రైవేటు కేసులు నమోదు చేయించారని కోర్టుకు తెలిపారు.

ఎంపీ అవినాష్‍కు అసెంబ్లీ సాక్షిగా జగన్ క్లీన్‍చిట్ ఇచ్చారని సునీత తన పిటిషన్‍లో పేర్కొన్నారు. వివేకా హత్య గురించి జగన్‍కు ముందే తెలిసిందని పేర్కొన్నారు. జగన్‍కు ముందే తెలిసిన విషయాన్ని సీబీఐ తాజాగా బయటపెట్టిందని, అవినాష్ సీబీఐ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. ఏప్రిల్ 24 తర్వాత మూడుసార్లు నోటీసులిచ్చినా విచారణకు రాలేదని, అరెస్టు తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్టుకు వెళ్లిన సీబీఐ అధికారులను ఎంపీ మద్దతుదారులు అడ్డుకున్నారని వివరించారు. మరోవైపు ఈ కేసులో అదనపు పత్రాల సమర్పణకు సునీతకు కోర్టు అనుమతించింది.

మరోవైపు సునీత పిటిషన్ సందర్భంగా సుప్రీం కోర్టులో ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తానే వాదనలు వినిపిస్తానని సునీత కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రావడంతో కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చారు.

దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా సీనియర్‌ లాయర్ ను సాయం కోసం పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత పిటిషన్ విచారణ సందర‌్భంగా ధర్మాసనంతో ఆసక్తికరమైన చర్చ జరిగింది.

సుప్రీం కోర్టులో ఆసక్తికరమైన చర్చ…

జస్టిస్ విక్రమ్ నాథ్ : ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ ముందున్న బెంచ్ కు రావాల్సిన పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.

జస్టిస్ A.అమానుల్లా : ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఈ కేసులో సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి.

సుప్రీంకోర్టు : ఈ కేసును మీరు తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారని సునీతను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. పిటిషనర్‌ న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చని, కేసును డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్ కు సమస్య ఎదురవుతుందని సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా? అని ప్రశ్నించారు.

సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోగా సిబిఐకి ఇచ్చిన దర్యాప్తు గడువు ముగుస్తుందనికోర్టుకు వివరించారు.

సుప్రీంకోర్టు : లుథ్రా.. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. పిటిషనర్‌ వాదనలు వద్దంటున్నా.. తలదూర్చాలనుకుంటున్నారంది. సుప్రీం కోర్టులోనే ఒక బెంచ్ ఇచ్చిన గడువుపై మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా? అని ప్రశ్నించింది.

సునీత : ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐని ఆదేశించాలని సూచించారు.

సుప్రీంకోర్టు : అలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తామని ఈ పిటిషన్ లో విచారణకు రావాలా లేదా అన్నది CBI ఇష్టమని, పిటిషనర్‌ జులై 3న రావాలని సూచించారు.

సునీత : హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిర్ణయించే తుది అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గతంలో మీరు చెప్పారు కదా అని ప్రశ్నించారు.

జస్టిస్ A.అమానుల్లా : మీరు ఆరోపణలు చేస్తున్న నిందితుడు మీ కజినా?

సునీత : అవును, అవినాష్ రెడ్డి నాకు సెకండ్ కజిన్ అని బదులిచ్చారు.

సీనియర్ లాయర్ లుథ్రా: ఈ కేసును రేపు పరిశీలించాలని విజ్ఞప్తి చేవారు. రేపు అడ్వొకేట్ ఆన్ రికార్డును కోర్టు ముందుంచుతానని, తాను వాదనలు వినిపిస్తానని చెప్పారు.

సుప్రీంకోర్టు : పిటిషనర్‌ అడిగినట్టు CBIకి నోటీసులు ఇవ్వలేమని కేసును జూన్ 19వ తేదీకి (వచ్చే సోమవారం) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

WhatsApp channel