Telugu News  /  Andhra Pradesh  /  Student Stuck Between Train And Footpath At Duvvada Railway Station
రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న యువతి
రైలు-ప్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న యువతి

Duvvada Railway Station : రైలు - పుట్‌పాత్‌ మధ్య ఇరుక్కున్న విద్యార్ధిని

07 December 2022, 11:28 ISTHT Telugu Desk
07 December 2022, 11:28 IST

student stuck betwenn train and footpath: ప్లాట్‌ఫామ్‌ మీద నుంచి రైలు ఎక్కుతున్న క్రమంలో ఓ విద్యార్థిని కిందపడిపోయింది. ఈ క్రమంలో ఫుట్‌పాత్‌, రైలులో మధ్యలో ఇరుక్కుపోయింది. గంటన్నర పాటు నరకయాతన చూసింది. ఎట్టకేలకు రైల్వే అధికారులు విద్యార్థినిని బయటికి తీశారు.

Student Stuck at Duvvada Railway Station: రైలు ఎక్కుతూ ట్రాక్ కింద పడిపోవటం.. ప్రాణాలు కోల్పోవటం లేదా కాపాడటం వంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించిన చాలా విజువల్స్ వైరల్ అవుతుండటం కూడా ఉంటాయి. అయితే రైలు ఎక్కేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే అధికారులు, సిబ్బంది హెచ్చరిస్తూనే ఉంటారు. తాజాగా ఏపీలో మరో ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఓ విద్యార్థి ఫుట్‌పాత్‌, రైలు మధ్యలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగిందంటే....

విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో అనుకోని ఘటన జరిగింది. అన్నవరానికి చెందిన శశికళ (20) కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ లో దువ్వాడకు చేరుకుంది. రైలు దిగే క్రమంలో ఒక్కసారిగా రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. గంటకుపైగా తీవ్రంగా ఇబ్బంది పడింది. విషయం తెలిసిన రైల్వే సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి.. ప్లాట్ ఫామ్ పగలగొట్టి యువతిని బయటకు తీశారు.

అనంతరం యువతిని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది.