Registrations : గాంధీ జయంతి నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు-stamps and registration services will start from october 2 gandhi jayanthi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Stamps And Registration Services Will Start From October 2 Gandhi Jayanthi

Registrations : గాంధీ జయంతి నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు

HT Telugu Desk HT Telugu
Sep 23, 2022 06:00 AM IST

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న నేపథ‌్యంలో గాంధీ జయంతి రోజు నుంచి Registrations రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రారంభించనున్నారు. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ వంటి సేవలు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేసుకోవచ్చు.

గ్రామ సచివాలయాల్లోనే గాంధీ జయంతి నుంచి రిజిస్ట్రేషన్లు
గ్రామ సచివాలయాల్లోనే గాంధీ జయంతి నుంచి రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతి రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేష్లను ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1949 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో Registrations రిజిస్ట్రేషన్ సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తామని రెండేళ్లుగా ప్రభుత్వం చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఏపీలో Registrations స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లోకి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1949 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ డిఐజి శివరాం ప్రకటించారు. కడపలోని కమలాపురంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పరిశీలించిన డిఐజి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు.

ప్రజల ముంగిట్లోకి పౌరసేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో మూడేళ్ల క్రితం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ప్రతి 50ఇళ్ళకు ఓ వాలంటీర్‌ను నియమించి వారి ద్వారా సంక్షేమ పథకాలను ఇంటింటికి అందిస్తున్నారు. ప్రతి 2వేల కుటుంబాలకు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీల పరిధిలో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.

వీటి ద్వారానే ప్రస్తుతం చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా Registrations సేవల్ని కూడా సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తొలి దశలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో అందుబాటులో ఉండే రిజిస్ట్రేషన్‌, వివాహ రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్ల జారీ, ఈసీల జారీ తదితర సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రానున్నాయి. సచివాలయాల నుంచి రిజిస్ట్రేషన్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంపై ఏడాదిన్నరకు పైగా ప్రయోగాలు నిర్వహించారు.

తొలి దశలో 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో Registrations సేవల్ని ప్రయోగాత్మకంగా అందించారు. రిజిస్ట్రేషన్ సేవలు అందించడంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారరు. సచివాలయాల పరిధిలో పంచాయితీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు నెట్‌వర్క్‌ , స్కానింగ్‌, వెబ్‌ క్యామ్‌ రిజిస్ట్రేషన్లు, సెటిల్‌మెంట్లు, పార్టీషన్లు ఎలా చేయాలనే దానిపై శిక్షణనిచ్చారు.త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

WhatsApp channel

టాపిక్