Teppotsavams at Tirumala: వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. భక్తులకు రుక్మిణీకృష్ణుల అభయం
- Srivari Salakatla Teppotsavam 2023:తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు కన్నులపండుగగా సాగుతున్నాయి. ఐదు రోజులు సాగే ఈ తెప్పోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక ఇవాళ (ఆదివారం) శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అవతారంలో తెప్పపై మూడుచుట్లు విహరించనున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీగ పాల్గొంటున్నారు. మరోవైపు పలువురు ప్రముఖలు కూడా తెప్పోత్సవాల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

(1 / 4)
శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం రాత్రి రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారి అవతారంలో భక్తులను కటాక్షించారు.(ttd)
(2 / 4)
సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో శోభాయమానంగా తెప్పను అలంకరించారు.స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజుల పాటు నిత్యం సాయం సంధ్యా వేలా తెప్పలపై విహరిస్తూ శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తారు. (ttd)
(3 / 4)
తిరుచ్చిపై రుక్మిణీకృష్ణుల ఉత్సవమూర్తులు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పుష్కరిణిలోని తెప్పను అధిరోహించారు. (ttd)
(4 / 4)
ఇక ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అవతారంలో తెప్పపై మూడుచుట్లు విహరించనున్నారు. (ttd)
ఇతర గ్యాలరీలు