Railway information : శ్రీకాకుళం రోడ్ - చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య ప్రత్యేక రైళ్లు... ఈ రూట్లలో 4 రైళ్లు రద్దు-special trains between srikakulam road charlapally station ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Railway Information : శ్రీకాకుళం రోడ్ - చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య ప్రత్యేక రైళ్లు... ఈ రూట్లలో 4 రైళ్లు రద్దు

Railway information : శ్రీకాకుళం రోడ్ - చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య ప్రత్యేక రైళ్లు... ఈ రూట్లలో 4 రైళ్లు రద్దు

HT Telugu Desk HT Telugu
Published Feb 18, 2025 10:40 AM IST

ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకు శ్రీకాకుళం రోడ్-చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ రైళ్లను ప్రకటించారు. అంతేకాకుండా ఫిబ్రవరి 20 20 నుంచి విశాఖ‌ప‌ట్నం -లోక‌మాన్య తిల‌క్ ట‌ర్మిన‌ల్‌-విశాఖ‌ప‌ట్నం ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ పున‌రుద్ధ‌రించ‌నున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు వివరాలను ప్రకటించారు.

శ్రీకాకుళం రోడ్ -చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ రైళ్లు
శ్రీకాకుళం రోడ్ -చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ రైళ్లు

చ‌ర్ల‌ప‌ల్లి-శ్రీ‌కాకుళం రోడ్డు-చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ రైలు న‌డుపుతున్న‌ట్లు వాల్తేర్ డివిజన్ సీనియ‌ర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. చర్లపల్లి - శ్రీకాకుళం స్పెషల్ ఎక్స్‌ప్రెస్(రైలు నెంబ‌ర్ 07025) ఫిబ్రవరి 21న రాత్రి 21.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డి నుంచి ఉద‌యం 9.47 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్‌కు మ‌ధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది.

శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి స్పెషల్ ఎక్స్‌ప్రెస్(రైలు నెంబ‌ర్ 07026) ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 4.45 గంటలకు దువ్వాడ చేరుకుని… అక్క‌డి నుంచి సాయంత్రం 4.47 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉద‌యం 6.00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రెండు స్పెష‌ల్ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి-శ్రీకాకుళం రోడ్ మ‌ధ్య‌ చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్లు, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి రైల్వే స్టేష‌న్‌లో ఆగుతాయి.

ఈ రెండు స్పెష‌ల్ రైళ్ల‌లో సెకెండ్‌ ఏసీ- 1, థ‌ర్డ్ ఏసీ - 8, స్లీపర్ క్లాస్-9, జనరల్ సెకండ్ క్లాస్-2, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్‌లు-1, జనరేటర్ మోటార్ కార్-1 ఎల్‌హెచ్‌బి కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ పున‌రుద్ధ‌ర‌ణ‌:

విశాఖ‌ప‌ట్నం-లోక‌మాన్య తిల‌క్ టెర్మిన‌ల్-విశాఖ‌ప‌ట్నం మ‌ధ్య న‌డిచే లోక‌మాన్య తిల‌క్ టెర్మిన‌ల్ ఎక్స్‌ప్రెస్ పున‌రుద్ధ‌రిస్తున్నట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ కె. సందీప్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి విశాఖ‌-లోక‌మాన్య తిల‌క్ టెర్మినల్ (18519) ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్, ఈ నెల 22 నుంచి లోక‌మాన్య తిల‌క్ టెర్మిన‌ల్-విశాఖ‌ప‌ట్నం (18520) ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ య‌థావిధిగా రాక‌పోక‌లు సాగిస్తాయి.

ఈ రెండు రైళ్లు…. విశాఖ‌ప‌ట్నం, దువ్వాడ‌, పిఠాపురం, సామ‌ర్ల‌కోట‌, రాజ‌మండ్రి, త‌ణుకు, భీమ‌వ‌రం, అకివీడు, కైక‌ళూరు, గుడివాడ‌, విజ‌య‌వాడ‌, కాజీపేట‌, మౌలాలి, సికింద్ర‌బాద్‌, లింగంప‌ల్లి, వికారాబాద్‌, తాండూరు రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతాయి. ఈ రెండు రైళ్ల‌లో ఫ‌స్ట్ ఏసీ-1 సెకెండ్‌ ఏసీ- 1, థ‌ర్డ్ ఏసీ - 5, స్లీపర్ క్లాస్-6, జనరల్ సెకండ్ క్లాస్-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్‌లు-1, జనరేటర్ మోటార్ కార్-1 ఎల్‌హెచ్‌బి కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

నాలుగు రైళ్ల రద్దు:

ఆయా ప్రాంతాల్లో జ‌రుగుతున్న నిర్వ‌హ‌ణ ప‌నుల కార‌ణంగా నాలుగు రైళ్లు ర‌ద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

1. రైలు నెంబ‌ర్ 22807 సంత్రాగచ్చి-ఎంజీఆర్ చెన్నై ఎక్స్‌ప్రెస్ ఫిబ్ర‌వ‌రి 21న రద్దు చేశారు.

2. రైలు నెంబ‌ర్ 22808 ఎంజీఆర్ చెన్నై-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ ఫిబ్ర‌వ‌రి 23న రద్దు చేశారు.

3. రైలు నెంబ‌ర్ 22853 షాలిమార్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ఫిబ్ర‌వ‌రి 28న రద్దు చేశారు.

4. రైలు నెంబ‌ర్ 22854 విశాఖపట్నం-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్ర‌వ‌రి 19న రద్దు చేశారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం