Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, పది రైళ్లు రద్దు
Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్... సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో అభివృద్ధి పనుల కారణంగా పది రైళ్లు రద్దు అయ్యాయి. విశాఖపట్నం మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Trains Cancelled : ప్రయాణికులకు ఇండియన్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని రూర్కెలా-జార్సుగూడ సెక్షన్‌లోని కన్స్‌బహల్, రాజ్‌గంగ్‌పూర్, సాగర, గర్పోష్ స్టేషన్‌లలో భద్రతకు సంబంధించిన అభివృద్ధి పనుల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులు అలాగే, ఇతర కార్యకలపాల కారణాల వల్ల పది రైళ్లు రద్దు చేశారు. ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని అభ్యర్థించారు. ఈ అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన రైళ్లు
1. డిసెంబర్ 29న విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 18311 విశాఖపట్నం- బనారస్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు.
2. డిసెంబర్ 30న బనారస్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 18312 బనారస్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు.
3. డిసెంబర్ 26 నుండి ఫిబ్రవరి 28 వరకు రాజమండ్రి నుండి బయలుదేరే రైలు నెంబర్ 07466 రాజమండ్రి-విశాఖపట్నం మెము రైలు రద్దు చేశారు.
4. డిసెంబర్ 27 నుండి మార్చి 1 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 07467 విశాఖపట్నం-రాజమండ్రి మెము రైలు రద్దు చేశారు.
5. డిసెంబర్ 26 నుండి ఫిబ్రవరి 28 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 07468 విశాఖపట్నం-విజయనగరం మెము రైలు రద్దు చేశారు.
6. డిసెంబర్ 27 నుండి మార్చి 1 వరకు విజయనగరం నుండి బయలుదేరే రైలు నెంబర్ 07469 విజయనగరం-విశాఖపట్నం మెము రైలు రద్దు చేశారు.
7. డిసెంబర్ 27 నుండి మార్చి 1 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 07470 విశాఖపట్నం-పలాస మెము రైలు రద్దు చేయబడుతుంది.
8. డిసెంబర్ 27 నుండి మార్చి 1 వరకు పలాస నుండి బయలుదేరే రైలు నెంబర్ 07471 పలాస-విశాఖపట్నం మెము రైలు రద్దు చేశారు.
9. డిసెంబర్ 29న రూర్కెలా నుండి బయలుదేరే రైలు నెంబర్ 18107 రూర్కెలా - జగదల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు.
10. డిసెంబర్ 29న జగదల్పూర్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 18108 జగదల్పూర్ - రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు.
ఒక జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్ పెంపు
రెండు రైళ్లకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్ పెంచాలని రైల్వే నిర్ణయించింది.
1. రైలు నెంబర్ 13351 ధన్‌బాద్ - అల్లెపి బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు శాశ్వత ప్రాతిపదికన ఒక జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌ను జత చేస్తారు. ఇది డిసెంబర్ 26 నుండి అమలులోకి వస్తుంది.
2. రైలు నెంబర్ 13352 అల్లెపి - ధనాబాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు శాశ్వత ప్రాతిపదికన ఒక జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్ జత చేస్తారు.ఇది డిసెంబర్ 29 నుండి అమలులోకి వస్తుంది.
సవరించిన కోచ్‌లతో ఈ రెండు రైళ్లకు ఫస్ట్ ఏసీ కోచ్ -1, సెకెండ్ ఏసీ కోచ్‌లు-2, థర్డ్ ఏసీ కోచ్‌లు-6, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-6, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగజన్ కోచ్-1, ఏసీ ప్యాంట్రీ కార్-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్‌లు ఉంటాయి.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం