South Coastal Zone: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు, 410 కి.మీ పరిధి ఖరారు…
South Coastal Zone: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని ఖరారు చేశారు. 410 కి.మీ పరిధితో కొత్త జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ అమోదం తెలిపింది. ఇక వాల్తేర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం డివిజన్‌గా పరిగణిస్తారు.
South Coastal Zone: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని ఖరారు చేశారు. విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను కొత్త జోన్‌లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తారు. కొత్త రైల్వే జోన్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు ఉంటాయి.

మరోవైపు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి మోటుమర్రి సెక్షన్‌ను కూడా విజయవాడ డివిజన్‌లో విలీనం చేశారు. పాలనా సౌలభ్యం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ శివార్లలో ఉండే కొండపల్లి ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇకపై మోటుమర్రి వరకు విజయవాడ సెక్షన్‌లో భాగంగా పరిగణిస్తారు. మొత్తం 410 కి.మీ పరిధిలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారు.