Trains Information : రైల్వే అలర్ట్, తొమ్మిది రైళ్లు మళ్లింపు-నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లు
Trains Information : విజయవాడ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా తొమ్మిది రైళ్లను మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు నిడదవోలు-ఏలూరు-విజయవాడ మీదుగా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా రైళ్లు దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా తొమ్మిది రైళ్లను మళ్లిస్తున్నారు. ఈ రైళ్లు నిడదవోలు-ఏలూరు-విజయవాడ మీదుగా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా రైళ్లు దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి.
1. ధన్‌బాద్ నుంచి బయలుదేరే రైలు నెంబర్ 13351 ధన్‌బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్‌లను తొలగించారు.
2. టాటా నుంచి బయలుదేరే రైలు నెంబర్ 18111 టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నవంబర్ 21, 28 తేదీలలో ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. ఏలూరు స్టాప్‌ను తొలగించారు.
3. జసిదిహ్ నుంచి బయలుదేరే రైలు నెంబర్ 12376 జసిదిహ్-తాంబరం ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నవంబర్ 20 నుంచి 27 వరకు ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. ఏలూరు స్టాప్‌ను తొలగించారు.
4. హటియా నుంచి బయలుదేరే రైలు నెంబర్ 22837 హతియా-ఎర్నాకులం ఏసీ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నవంబర్ 25న ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. ఏలూరు స్టాప్‌ను తొలగించారు.
5. హటియా నుంచి బయలుదేరే రైలు నెంబర్ 18637 హతియా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నవంబర్ 23 నుంచి 30 వరకు ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది.
6. హటియా నుంచి బయలుదేరే రైలు నెంబర్ 12835 హతియా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నవంబర్ 19, 26 తేదీల్లో ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది.
7. టాటా నగర్‌లో బయలుదేరే రైలు నెంబర్ 12889 టాటా నగర్-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నవంబర్ 22, 29 తేదీల్లో ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది.
8. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 18503 విశాఖపట్నం- సాయి నగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. నవంబర్ 28న ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. ఏలూరు స్టాప్‌ను తొలగించారు.
9. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 12803 విశాఖపట్నం- నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ నవంబర్ 29న ఈ మార్గంలోనే రాకపోకలు నిర్వహిస్తుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్‌లను తొలగించారు.
నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లు
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి నాలుగు రైళ్లకు అదనపు కోచ్‌లతో పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.
1. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463) రైలుకు నవంబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు రెండు థర్డ్ ఏసీ కోచ్‌లు పెంచనున్నారు.
2. కేఎస్ఆర్ బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలుకు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు రెండు థర్డ్ ఏసీ కోచ్‌లు పెంచనున్నారు.
3. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22879) రైలుకు నవంబర్ 23, 30 తేదీల్లో రెండు థర్డ్ ఏసీ కోచ్‌లు పెంచనున్నారు.
4. తిరుపతి - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22880) రైలుకు నవంబర్ 24, డిసెంబర్ 1 తేదీల్లో రెండు థర్డ్ ఏసీ కోచ్‌లు పెంచనున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం