SCR Mahakumbh Mela Special Trains 2025 : ఏపీ నుంచి మహా కుంభమేళాకు 12 ప్రత్యేక రైళ్లు - ఇవిగో వివరాలు-south central railway to run mahakumbh mela special trains from andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Scr Mahakumbh Mela Special Trains 2025 : ఏపీ నుంచి మహా కుంభమేళాకు 12 ప్రత్యేక రైళ్లు - ఇవిగో వివరాలు

SCR Mahakumbh Mela Special Trains 2025 : ఏపీ నుంచి మహా కుంభమేళాకు 12 ప్రత్యేక రైళ్లు - ఇవిగో వివరాలు

SCR Mahakumbh Mela Special trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహాకుంభ మేళకు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో కొన్ని విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ నుంచి రాకపోకలు సాగిస్తాయి.

ప్రత్యేక రైళ్లు (image source unsplash.com)

మహా కుంభమేళకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 12 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

12 ప్రత్యేక రైళ్లు - వివరాలు

  • తిరుపతి - బనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్లు జనవరి 18, ఫిబ్రవరి 2, 25, 15, 22 తేదీల్లో ఈ ట్రైన్స్ రాకపోకలు ఉంటాయి. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట, అన్నవరం, ఎలమంచలి, అనకాపల్లి, రాయగడ, మునిగుడతో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆగుతాయి.
  • బనారస్ - విజయవాడ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. జనవరి 20, ఫిబ్రవరి 2, 25, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి.. బుధవారం ఉదయం 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • ఇక నర్సాపూర్ నుంచి బనారస్ కు 2 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ ఉదయం 6 గంటలకు బయల్దేరి... మధ్యాహ్నం 3.45 గంటలకు బనాసర్ చేరుతుంది.
  • బనారస్ నుంచి నర్సాపూర్ మధ్య మరో 2 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ ట్రైన్ జనవరి 27, ఫిబ్రవరి 3వ తేదీన ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై... ఉదయం 5 గంటలకు నర్సాపూర్ చేరుతుంది.

20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు:

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. జనవరి 1 నుంచి మార్చి నెల వరకు రాకపోకలు ఉంటాయని పేర్కొంది.

మొత్తం 20 రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో చాలా రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. వచ్చే జనవరిలోనే సంక్రాంతి పండగ ఉంది. దేశవ్యాప్తంగానూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి సెలవులు ఉండటంతో… చాలా మంది సొంత ఊర్లకు ప్రయాణమవుతుంటారు. వీటన్నింటి దృష్ట్యా… ఈ రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటనలో వెల్లడించింది.