Sankranti Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఎనిమిది స్పెష‌ల్ ట్రైన్స్-south central railway running 8 special trains to clear sankranti rush ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankranti Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఎనిమిది స్పెష‌ల్ ట్రైన్స్

Sankranti Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఎనిమిది స్పెష‌ల్ ట్రైన్స్

HT Telugu Desk HT Telugu
Dec 29, 2024 05:14 PM IST

Sankranti Special Trains : సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, విశాఖ, పార్వతీపురం, హైదరాబాద్, కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.

 రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఎనిమిది స్పెష‌ల్ ట్రైన్స్
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఎనిమిది స్పెష‌ల్ ట్రైన్స్

Sankranti Special Trains : సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-పార్వతీపురం, సికింద్రాబాద్- బ్రహ్మపూర్, హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

yearly horoscope entry point

సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

1. సికింద్రాబాద్ నుంచి బ‌య‌లురేదే రైలు నెంబ‌ర్ 07097 సికింద్రాబాద్ - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జ‌న‌వ‌రి 5 నుంచి జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో ఆదివారాల్లో సాయంత్రం 4:35 గంట‌ల‌కు బ‌య‌లుదేరి మ‌రుస‌టి రోజు సోమ‌వారం ఉద‌యం 5:47 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

2. విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్ 07098 విశాఖపట్నం-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జ‌న‌వ‌రి 6 నుంచి జ‌న‌వ‌రి 13 అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖ‌ప‌ట్నంలో సోమవారాల్లో రాత్రి 7:50 గంటలకు మ‌రుస‌టి రోజు మంగళవారం ఉద‌యం 11:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు సికింద్రాబాద్‌-విశాఖపట్నం మ‌ధ్య నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతాయి. ఈ రెండు రైళ్లలో సెకెండ్ ఏసీ-2, థ‌ర్డ్ ఏసీ-6, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-7, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ/ దివ్యాంగులు -1, మోటార్ కార్-1 కోచ్ ఉంటాయి.

విశాఖపట్నం- పార్వతీపురం ప్రత్యేక రైళ్లు

1. విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్ 08565 విశాఖపట్నం-పార్వతీపురం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు జ‌న‌వ‌రి 10 నుంచి జ‌న‌వ‌రి 20 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో ఉద‌యం 10 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. ఉద‌యం 10.58 గంటలకు విజయనగరం, 11.55 గంటలకు బొబ్బిలి, మ‌ధ్యాహ్నం 12.20 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.

2. పార్వ‌తీపురంలో నుంచి బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్‌ 08566 పార్వతీపురం-విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు జ‌న‌వ‌రి 10 నుంచి జ‌న‌వ‌రి 20 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పార్వతీపురం మ‌ధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరుతుంది. మ‌ధ్యాహ్నం 1.10 గంట‌ల‌కు బొబ్బిలి, మ‌ధ్యాహ్నం 2.10 గంటలకు విజ‌య‌న‌గరం, సాయంత్రం 4 గంట‌ల‌కు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ రెండు రెళ్లు విశాఖపట్నం-పార్వతీపురం మధ్య సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లె, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతోంది. ఈ రైలుకు ఎనిమిది మెము కోచ్‌లు ఉంటాయి.

సికింద్రాబాద్- బ్రహ్మపూర్ స్పెష‌ల్ రైళ్లు

1. సికింద్రాబాద్‌లో బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్ 07027 సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జ‌న‌వ‌రి 3 నుంచి జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో శుక్రవారం రాత్రి 8:15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు శ‌నివారం మ‌ధ్యాహ్నం 2:45 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది.

2. బ్రహ్మపూర్‌లో బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్‌ 07028 బ్రహ్మపూర్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు జ‌న‌వ‌రి 4 నుంచి జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు అందుబాటులో ఉటుంది. రైలు బ్ర‌హ్మ‌పూర్‌లో శనివారం సాయంత్ర 4:45 గంటలకు బయలుదేరుతుంది. మ‌రుస‌టి రోజు ఆదివారం ఉద‌యం 11:35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్‌-బ్రహ్మపూర్ మ‌ధ్య‌ నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, నౌప‌డ, ప‌లాస‌, సోంపేట‌, ఇచ్చాపురం రైల్వే స్టేష‌న్‌లో ఆగుతుంది. ఈ రెండు రైళ్లలో సెకెండ్‌ ఏసీ-2, థ‌ర్డ్ ఏసీ-6, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-7, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ/ దివ్యాంగజన్ -1, మోటార్ కార్-1 కోచ్ ఉంటాయి.

హైదరాబాద్ - కటక్ స్పెష‌ల్ రైళ్లు

1. హైద‌రాబాద్‌లో బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్‌ 07165 హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు జ‌న‌వ‌రి 7 నుంచి జ‌న‌వ‌రి 21 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు హైద‌రాబాద్‌లో మంగళవారం రాత్రి 8.10 గంటలకు బయలుదేరుతుంది. మ‌రుస‌టి రోజు బుధ‌వారం సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది.

2. క‌ట‌క్‌లో బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్‌ 07166 కటక్-హైదరాబాద్ ప్రత్యేక రైలు జ‌న‌వ‌రి 8 నుంచి జ‌న‌వ‌రి 22 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు క‌ట‌క్‌లో బుధవారం రాత్రి 10:30 గంటలకు కటక్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు గురువారం రాత్రి 9 గంట‌ల‌కు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు హైద‌రాబాద్-క‌ట‌క్ మ‌ధ్య సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ఆగుతోంది. ఈ రెండు రైలులో సెకెండ్‌ ఏసీ-4, థ‌ర్డ్‌ ఏసీ-8, స్లీపర్-6, జనరల్ క్లాస్-2, జనరేటర్ మోటార్ కార్లు-2 కోచ్‌లు ఉంటాయి.

రిపోర్టింగ్ : జ‌గదీశ్వర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం