SCR Special Trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుప‌తి- సికింద్రాబాద్ మ‌ధ్య ప్ర‌త్యేక రైలు-south central railway is running special train between secunderabad and tirupati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Scr Special Trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుప‌తి- సికింద్రాబాద్ మ‌ధ్య ప్ర‌త్యేక రైలు

SCR Special Trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తిరుప‌తి- సికింద్రాబాద్ మ‌ధ్య ప్ర‌త్యేక రైలు

Basani Shiva Kumar HT Telugu
Nov 12, 2024 12:58 PM IST

SCR Special Trains : సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సౌట్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. అటు విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

తిరుప‌తి- సికింద్రాబాద్ మ‌ధ్య ప్ర‌త్యేక రైలు
తిరుప‌తి- సికింద్రాబాద్ మ‌ధ్య ప్ర‌త్యేక రైలు

రైల్వే ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీని త‌గ్గించ‌డం కోసం, సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణాన్ని అందించ‌డం కోసం ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 13న ఈ రైలు అందుబాటులోకి రానున్న‌ట్లు అధికారులు వెల్లడించారు. అలాగే న‌వంబ‌ర్ 14న విజ‌య‌వాడ మీదుగా ప్ర‌త్యేక రైలును న‌డుపుతున్న‌ట్లు వాల్తేర్ డివిజ‌న్ అధికారులు వెల్లడించారు.

తిరుప‌తి- సికింద్రాబాద్ (07001) స్పెష‌ల్ రైలు న‌వంబర్ 13 (బుధ‌వారం) రాత్రి 8.15 గంట‌ల‌కు తిరుప‌తిలో బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు (గురువారం) ఉద‌యం 8.30 గంట‌ల‌కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ స్పెష‌ల్ రైలు తిరుప‌తి- సికింద్రాబాద్ మ‌ధ్య‌ రేణిగుంట‌, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల‌, తెనాలి, గుంటూరు, స‌త్తెన‌ప‌ల్లి, న‌డికుడి, మిర్యాల‌గూడ‌, న‌ల్గొండ స్టేష‌న్ల‌లో ఆగుతుంది.

ఈ స్పెష‌ల్ రైలుకు ఫ‌స్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థ‌ర్డ్ ఏసీ, స్లీప‌ర్ క్లాస్‌, జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయ‌ని.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్ ఎ.శ్రీధ‌ర్ తెలిపారు.

విజ‌య‌వాడ మీదుగా..

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విజ‌య‌వాడ మీదుగా ఎస్ఎంవీటీ బెంగ‌ళూరు- మాల్దా టౌన్ మ‌ధ్య అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు న‌డుపుతున్నారు. ఈనెల 14న ఈ రైలు అందుబాటులోకి రానున్న‌ట్లు వాల్తేర్ డివిజ‌న్ అధికారులు తెలిపారు.

ఎస్ఎంవీటీ బెంగళూరు -మాల్దా టౌన్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ (03404) రైలు ఎస్ఎంవీటీ బెంగళూరు నుండి న‌వంబ‌ర్ 14 (గురువారం)న ఉద‌యం 7:00 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉద‌యం 2:28 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డి నుంచి ఉద‌యం 2:30 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం ఉదయం 3:55 గంటలకుచేరుకుని, అక్క‌డి నుంచి 4:05 గంటలకు బయలుదేరుతుంది. శనివారం ఉద‌యం 8:00 గంటలకు మాల్డా టౌన్ చేరుకుంటుంది.

ఈ రైలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేణిగుంట‌, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, సామ‌ర్ల‌కోట‌, దువ్వాడ‌, విజ‌య‌న‌గరం రైల్వే స్టేష‌న్ల‌లో స్టాప్ ఉంది. ఈ రైలకు సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు-16, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగజన్ కోచ్‌లు-2 ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ కె.సందీప్‌ కోరారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner