SCR Trains Info: నర్సాపూర్‌-బెంగుళూరు మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు..-south central railway has announced special trains between narsapurbangalore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  South Central Railway Has Announced Special Trains Between Narsapur-bangalore

SCR Trains Info: నర్సాపూర్‌-బెంగుళూరు మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు..

HT Telugu Desk HT Telugu
Apr 28, 2023 09:34 AM IST

SCR Trains Info: వేసవి ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి నర్సాపూర్-బెంగుళూరు మధ్య వేసవిలో ఎనిమిది ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.

వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి ప్రత్యేక రైళ్లు

SCR Trains Info: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్‌-బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మే 5 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ట్రైన్ నంబర్ 07153 నర్సాపూర్‌-బెంగళూరు ప్రత్యేక రైలు మే 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07154 బెంగుళూరు-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ మే 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలర్‌ పేట, బంగార్‌పేట్, కృష్ణార్జునపురం స్టేషన్లలో రెండువైపులా ఆగుతుంది.

నేటి నుంచి పలు రైళ్ల రద్దు….

విజయవాడ శివార్లలోని రాయనపాడు యార్డులో ట్రాఫిక్ బ్లాక్‌ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్రైన్‌ నంబర్ 07279 విజయవాడ-భద్రాచలం రోడ్డు, ట్రైన్ నంబర్ 07278 భద్రాచలం రోడ్-విజయవాడ రైలును నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07755 డోర్నకల్ జంక్షన్-విజయవాడ, 07756 విజయవాడ-డోర్నకల్ జంక్షన్ రైళ్లను మూడ్రోజుల పాటు రద్దు చేశారు.

IPL_Entry_Point