Top Speed Rail tracks దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లను గరిష్ట వేగంతో నడిపేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ-దువ్వాడ సెక్షన్ పరిధిలో వందే భారత్ రైలును 130కి.మీల వేగంతో విజయవంతంగా నడిపారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ వేగాన్ని అధిగమించారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే ట్రాక్ సామర్ధ్యాన్ని పెంచడంతో ఇది సాధ్యపడిందని రైల్వే అధికారులు ప్రకటించారు. 330.94కి.మీల దూరం ఉన్న దువ్వాడ-విజయవాడ సెక్షన్‌లో గరిష్టంగా 130కి.మీల వేగంతో రైళ్లను నడిపేందుకు అనుమతిస్తారు.,గత ఏడాది సెప్టెంబర్‌లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ వికర్ణ విభాగంలో 744 కి.మీల పొడవున 130కి.మీ వేగంతో ప్రయాణించేలా ట్రాక్‌లు సిద్ధం చేశారు. బల్హార్షా-కాజీపేట-గూడూరు సెక్షన్లలో 130కి.మీ వేగంతో రైళ్లు ప్రయాణించేలా ట్రాక్‌లను గత ఏడాది సిద్ధం చేశారు. ,,స్వర్ణ చతుర్భుజి మార్గంలో వాడి-గుంతకల్-రేణిగుంట మార్గంలోని 536 కి.మీ మార్గంలో కూడా గతంలోనే గరిష్ట వేగంతో ప్రయాణానికి అనుమతి లభించింది. సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో 132 కి.మీల హైడెన్సిటీ మార్గంలో కూడా 130 కి.మీ వేగంతో రైళ్ల ప్రయాణాలకు అనువుగా ట్రాక్‌లను తీర్చిదిద్దారు.,తాజాగా స్వర్ణ చతుర్భుజి మార్గంలో చివరిదైన దువ్వాడ-విజయవాడ సెక్షన్‌లో కూడా సిగ్నలింగ్, ట్రాక్ డెవలప్‌మెంట్ పనులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మార్గంలో గరిష్ట వేగంతో రైళ్లను నడిపేందుకు అమోదం లభించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 130కి.మీ వేగాన్ని అధిగమించారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ఇదే వేగంతో ప్రయాణించేందుకు అనుమతించనున్నారు.,రైళ్లను గరిష్ట వేగంతో నడపడానికి ప్రణాళికబద్దమైన విధానంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ట్రాక్‌లపై బరువైన పట్టాలను ఏర్పాటు చేయడం, 260మీటర్ల పొడవైన వెల్డింగ్ రైల్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం, వంపులు, ఎత్తు పల్లాలను సరిచేయడం, సిగ్నలింగ, ట్రాక్షన్ పరికరాలను అమర్చడం, లోకో మోటివ్‌ల సామర్ధ్యాన్ని పెంచడం, కోచ్‌లను ప్రమాదరహితంగా తీర్చిదిద్దడం వంటి పనులు చేపట్టారు. దువ్వాడ-విజయవాడ సెక్షన్ పనులు విజయవంతంగా పూర్తి చేయడంపై జిఎం అరుణ్ కుమార్ జైన్ సిబ్బందిని అభినందించారు.