South Central Railway : అనంతపురం మీదుగా నడిచే ఆరు రైళ్లు రద్దు.. ఈ రైళ్లకు అదనపు కోచ్‌లు
South Central Railway : అనంతపురం మీదుగా రాకపోకలు నిర్వహించే పలు రైళ్లను రద్దు చేశారు. తాడిపత్రి, కడప మీదుగా రాకపోకలు నిర్వహించే రెండు రైళ్లను 2 నెలల పాటు రద్దు చేశారు. కుంభమేళ పూర్తయ్యాక వీటిని పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.
అనంతపురం స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. అనంతపురం మీదుగా రాకపోకలు నిర్వహించే నాలుగు రైళ్లు, తాడిపత్రి, కడప మీదుగా రాకపోకలు నిర్వహించే రెండు రైళ్లను 2 నెలల పాటు రద్దు చేశారు. కుంభమేళ పూర్తయ్యాక వీటిని తిరిగి పునరుద్ధరించనున్నారు. మరోవైపు ఈస్ట్ కోస్టు రైల్వే విశాఖపట్నం మీదుగా రాకపోకల నిర్వహించే ఆరు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేసింది.
రద్దైన రైళ్లు..
1. తిరుపతి నుంచి వయా పాకాల, కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంకల్లు, బళ్లారి, రాయదుర్గం మీదుగా తిరుమలదేవరపల్లి వెళ్లే (57405) రైలును శనివారం నుంచి ఫిబ్రవరి 28 వరకు నిలిపివేశారు.
2. తిరుమలదేవరపల్లి నుంచి పాకాల, కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, బళ్లారి, రాయదుర్గం మీదుగా తిరుపతి వెళ్లే (57406) రైలును ఫిబ్రవరి 29 నుంచి మార్చి 1 వరకు నిలిపివేశారు.
3. గుంతకల్లు నుంచి వయా అనంతపురం, ధర్మవరం, కదిరి, పాకాల మీదుగా నడిచే గుంతకల్లు- తిరుపతి (57404) రైలును శనివారం నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేశారు.
4. తిరుపతి నుంచి వయా పాకాల, కదిరి, ధర్మవరం, అనంతపురం మీదుగా నడిచే తిరుపతి- గుంతకల్లు (57403) రైలును శనివారం నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేశారు.
5. తిరుపతి నుంచి వయా తాడిపత్రి, కడప, రాజంపేట మీదుగా నడిచే తిరుపతి- హుబ్లీ (57401) రైలును శనివారం నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేశారు.
6. హుబ్లీ నుంచి వయూ రాజంపేట, కడప, తాడిపత్రి మీదుగా నడిచే హుబ్లీ- తిరుపతి (47402) రైలును శనివారం నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు చేశారు.
అదనపు కోచ్‌లు..
పండుగ సీజన్‌లో వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఆరు రైళ్లకు అదనపు కోచ్‌లను పెంచనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.
1. రైలు నెంబర్ 18117 రూర్కెలా- గుణపూర్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలుకు డిసెంబర్ 30 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు.
2. రైలు నెంబర్ 18118 గుణుపూర్ - రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలుకు డిసెంబర్ 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ పెంచారు.
3. రైలు నెంబర్ 18107 రూర్కెలా- జగ్‌దల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 1 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు.
4. రైలు నెంబర్ 18108 జగదల్‌పూర్ - రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 2 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు.
5. రైలు నెంబర్ 22837 హతియా- ఎర్నాకులం ధర్తీ అబ్బా ఎక్స్‌ప్రెస్ రైలుకు డిసెంబర్ 30 వరకు ఒక థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ పెంచారు.
6. రైలు నెంబర్ 22838 ఎర్నాకులం-హతియా ధర్తీ అబ్బా ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 1 వరకు ఒక థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ పెంచారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)