Sankranti Special Trains : సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ఇవే….
Sankranti Special Trains దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపునున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ప్రకటించారు.
Sankranti Special Trains సంక్రంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. వివిధ ప్రాంతాలకు మొత్తం 94 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. .పండుగ సీజన్లలో రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే క్రమం తప్పకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ముఖ్యమైన సందర్భాలు, సెలవులలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోని వీటిని ఏర్పాటు చేస్తోంది. జనవరి నెలలో సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికుల నుండి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సంక్రాంతి పండుగ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
రద్దీకి అనుగుణంగా సెలవుల సమయంలో రైలు ప్రయాణికుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి వివిధ గమ్యస్థానాల మధ్య సంక్రాంతి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 1 నుంచి జనవరి 20 వరకు వేర్వేరు తేదీల్లో నడుపనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ గమ్య స్థానాలకు కూడా ఈ రైళ్లను నడుపుతోంది. ఈ రైలు సర్వీసులలో వివిధ రకాల కోచ్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో రిజర్వ్‌డ్ కోచ్‌లతో పాటు అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు అన్ని వర్గాల ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వేషన్ కోచ్‌లలో రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్ లతో పాటు ఐ.ఆర్. సి .టి . సి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు తమ టిక్కెట్‌లను మొబైల్ యాప్‌లో యు టి ఎస్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. యుటిఎస్ యాప్ కొనుగోళ్ల ద్వారా ప్రయాణ సమయంలో జనరల్ కౌంటర్‌ల వద్ద క్యూలో నిలబడకుండా నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
సంక్రాంతి ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని రైలు ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి రద్దీని నివారించేందుకు మరియు అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా సమీకరించడం ద్వారా ప్రయాణికులను సాఫీగా రవాణా చేయడానికి రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో రోలింగ్ స్టాక్, రూట్, సిబ్బంది తదితర వనరుల లభ్యత మేరకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టేందుకు జోన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఇవే…
⦁ ట్రైన్ నంబర్ 07067 మచిలీపట్నం – కర్నూలు సిటీ ప్రత్యేక రైలు శని, మంగళ, గురు వారాల్లో జనవరి 3, 5, 7, 10, 12, 14, 17 తేదీల్లో నడుస్తుంది.
⦁ ట్రైన్ నంబర్ 07068 కర్నూలు సిటీ - మచిలీపట్నం ప్రత్యేక రైలు ఆదివారం, బుధవారం, శుక్రవారాల్లో జనవరి 4, 6, 8, 11, 13, 15, 18 తేదీల్లో నడుస్తుంది.
⦁ట్రైన్ నంబర్ 07445 కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైలు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారంలలో జనవరి 2, 4, 6, 9, 11, 13, 16, 18 తేదీలలో నడుస్తుంది.
⦁ ట్రైన్ నంబర్ 07446 లింగంపల్లి కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు మంగళ,గురు, శనివారాల్లో జనవరి 3, 5, 7, 10, 12, 14, 17, 19 తేదీలలో నడుస్తుంది.
⦁ ట్రైన్ నంబర్ 07185 మచిలీపట్నం సికింద్రబాద్- ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం జనవరి 1, 8, 15 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
⦁ ట్రైన్ నంబర్ 07186 సికింద్రాబాద్ - మచిలీపట్నం ప్రత్యేక రైలు జనవరిలో 1, 8, 15 తేదీలలో అందుబాటులో ఉంటుంది.
⦁ట్రైన్ నంబర్ 07095 మచిలీపట్నం - తిరుపతి ప్రత్యేక రైలు జనవరి ఆది, సోమ, బుధ, శుక్ర వారాల్లో 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16 తేదీలలో నడుస్తుంది.
⦁ట్రైన్ నంబర్ 07096 తిరుపతి – మచిలీపట్నం ప్రత్యేక రైలు జనవరిలో సోమవారం, మంగళవారం, గురు, శనివారాల్లో జనవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17 తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
⦁ట్రైన్ నంబర్ 07698 విజయవాడ- నాగర్‌సోల్ ప్రత్యేక రైలు జనవరి 6, 13 తేదీలలో శుక్రవారం నడుస్తుంది.
⦁ ట్రైన్ నంబర్07699 నాగర్ సోల్-విజయవాడ ప్రత్యేక రైలు జనవరి 7, 14 తేదీలలో శనివారం పూట నడుస్తుంది.
⦁ ట్రైన్ నంబర్ 07607 పూర్ణ-తిరుపతి ప్రత్యేక రైలు జనవరిలో 2, 9, 16 తేదీలలో సోమవారం నడుస్తుంది.
⦁ట్రైన్ నంబర్ 07608 తిరుపతి-పూర్ణ ప్రత్యేక రైలు జనవరి 3, 10, 17 తేదీలలో మంగళవారం నడుస్తుంది.
⦁ట్రైన్ నంబర్ 07605 తిరుపతి -అకోలా ప్రత్యేక రైల జనవరి 6, 13 తేదీలలో శుక్రవారం పూట నడుస్తుంది.
⦁ ట్రైన్ నంబర్ 07606 అకోలా-తిరుపతి రైలు జనవరి 8, 15తేదీలలో నడువ నుంది.
⦁ట్రైన్ నంబర్07165 సికింద్రబాద్-కటక్ రైలు జనవరి 6,13తేదీలలో నడువనుంది.
⦁ ట్రైన్ నంబర్ 07166 కటక్ – సికింద్రబాద్ ప్రత్యేక రైలు జనవరి 7, 14 తేదీల్లో నడువనుంది.
⦁ ట్రైన్ నంబర్ 07431 నాందేడ్ -బ్రహ్మపూర్ రైలు జనవరి 7,14 తేదీల్లో నడువ నుంది.
⦁ ట్రైన్ నంబర్07432 బ్రహ్మపూర్-నాందేడ్ రైలు 8,15 తేదీల్లో నడువనుంది.
⦁ ట్రైన్ నంబర్07093 నాందేడ్-బ్రహ్మపూర్ ప్రత్యేక రైలు జనవరి 2,9 తేదీల్లో నడువనుంది.
⦁ ట్రైన్ నంబర్ 07094 యశ్వంత్ పూర్-నాందేడ్ ప్రత్యేక రైలు జనవరి 3,10తేదీల్లో నడువనుంది.
⦁ట్రైన్ నంబర్ 07265 హైదారబాద్ - యశ్వంత్‌పూర్ రైలు జనవరి 3,10,17 తేదీల్లో నడువనున్నాయి.
⦁ట్రైన్ నంబర్ 07266 యశ్వంత్‌పూర్-హైదరాబాద్‌పూర్ ప్రత్యేక రైలు జనవరి 4,11,18 తేదీల్లో నడువనుంది.
⦁ ట్రైన్ నంబర్ 07233 సికింద్రబాద్-యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు జనవరి 5,12,19 తేదీల్లో నడుస్తుంది.
⦁ ట్రైన్ నంబర్ 07234 యశ్వంత్‌పూర్ - సికింద్రబాద్ ప్రత్యేక రైలు జనవరి 6,13,20 తేదీల్లో నడువనుంది.