Telugu News  /  Andhra Pradesh  /  South Central Railway Anounced 30 Special Trains To Clear Festival Rush In Telugu States
పండుగ ప్రయాణాలకు మరిన్ని  ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
పండుగ ప్రయాణాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Sankranti Special Trains : సంక్రాంతి పండుగకు మరిన్ని ప్రత్యేక రైళ్లు....

30 December 2022, 6:44 ISTHT Telugu Desk
30 December 2022, 6:44 IST

Sankranti Special Trains సంక్రాంతి పండుగ రద్దీ నియంత్రణ కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే ప్రకటించిన రైళ్లతో పాటు మరో 30రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది.

Sankranti Special Trains సంక్రాంతి సీజన్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య లేదనే విమర్శలు, ప్రకటించిన రైళ్లలో ఇప్పటికే సీట్లన్ని నిండిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో 30 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. గతంలో ప్రకటించిన రైళ్లకు అదనంగా వీటిని నడుపుతారు.

ట్రెండింగ్ వార్తలు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, వికారాబాద్‌ నుంచి నర్సాపూర్‌, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. సంక్రాంతి సీజన్‌లో ఈ మార్గాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా వీటిని ప్రకటించింది. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్‌, అన్‌రిజర్వ్‌డ్ బోగీలను అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను రాత్రి పూట నడుపనున్నారు.

ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌తో పాటు రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ కేంద్రాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ లేని ప్రయాణాలకు యూటిఎస్‌ యాప్‌ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.

సంక్రాంతి సెలవుల సందర్భంగా ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా మరిన్ని ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు గుంటూరు డివిజనల్‌ రైల్వే అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచీగూడ, వికారబాద్‌ నుంచి ఈ ప్రత్యేక రైల్లు గుంటూరు మీదుగా నరసాపూర్‌, మచిలీపట్నం, కాకినాడ టౌన్‌కి వెళతాయన్నారు. ప్రయాణీకులు పీఆర్‌ఎస్‌ కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌/వెబ్‌సైట్‌లో రిజర్వుడ్‌ టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకోవచ్చన్నారు. జనరల్‌ బోగీలలో ప్రయాణించదలచిన వారు రైల్వేస్టేషన్లలో టిక్కెట్‌ కౌంటర్ల వద్ద రద్దీ దృష్ట్యా యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ని వినియోగించి బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు.

గుంటూరు మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లు….

ఈ నెల 9న నెంబరు. 07039 సికింద్రాబాద్‌ - కాకినాడ టౌన్‌, 10న నెంబరు. 07040 కాకినాడ టౌన్‌ - వికారాబాద్‌, 11న నెంబరు 07041 వికారాబాద్‌ - నరసాపూర్‌, నెంబరు. 07035 సికిందాబ్రాద్‌ - కాకినాడ టౌన్‌, 12న నెంబరు. 07042 నరసాపూర్‌ - సికింద్రాబాద్‌, నెంబరు.07036 కాకినాడ టౌన్‌ - వికారాబాద్‌, 13న నెంబరు 07037 వికారబాద్‌ - కాకినాడ టౌన్‌, నెంబరు 07023 సికింద్రాబాద్‌ - నరసాపూర్‌, 14న నెంబరు 07038 కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌, నెంబరు 07024 నరసాపూర్‌ - సికింద్రాబాద్‌, 15న నెంబరు. 07031 సికింద్రాబాద్‌ - కాకినాడ టౌన్‌, 16న నెంబరు. 07027 సికింద్రాబాద్‌ - కాకినాడ టౌన్‌, నెంబరు. 07032 కాకినాడ టౌన్‌ - వికారాబాద్‌, 17న నెంబరు .07028 కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌, నెంబరు 07033 వికారాబాద్‌ - కాకినాడ టౌన్‌, 18న నెంబరు. 07034 కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు తెలిపారు. వీటన్నింటికి ఈ నెల 31వ తేదీన ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సౌకర్యం ప్రారంభం కానుంది. ఈ రైళ్లకు నడికుడి, సత్తెనపల్లిలో నిలుపుదల సౌకర్యం ఉన్నట్లు చెప్పారు.

సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ ఇవే….