AP Cabinet 2024 : చంద్రబాబు కేబినెట్ లో సీనియర్లకు దక్కని చోటు..! 17 మంది కొత్తవారే
Chandrababu Cabinet 2024 Updates : ఏపీ కేబినెట్ లో పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. 17 మంది కొత్తవారికి కేబినెట్ లో బెర్త్ ఖరారైంది.

Chandrababu Cabinet 2024 Updates : ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరనుంది. ఇప్పటికే టీడీపీ కూటమి పార్టీల మధ్య మంత్రి పదవులు సర్దుబాటు ముగిసింది. తొలిత మంత్రి పదువుల ఫార్మూల 25 మంత్రి పదవుల్లో టీడీపీకి 19, జనసేనకి 4, బిజెపికి రెండు అనుకున్నారు. టీడీపీ నేతలు, జనసేన నేతలు కూడా అదే చెప్పారు. కానీ మంత్రి పదువుల కేటాయింపు మారింది.
టీడీపీకి 21, జనసేనకు 3, బీజేపీ 1 మంత్రి పదువుల కేటాయించారు. ఆయా పార్టీల నుంచి మంత్రులుగా ఎంపికైన వారు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీనియర్లకు మాత్రం మొండి చెయ్యే దక్కింది. మూడు పార్టీల్లో సీనియర్ నేతలుగా ఉన్నవారికి మంత్రి పదవులు దక్కలేదు.
టీడీపీలో పదవులు దక్కని సీనియర్లు….
టీడీపీలో సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు. పార్టీ కష్ట కాలంలో కూడా పార్టీతోనే ఉన్న అనేక మందికి పదవులు దక్కకపోవడంతో కొంత మంది నిరాశకు గురయ్యారు.
శ్రీకాకుళం నుంచి కూనరవికుమార్ (బీసీ), విజయనగరం నుంచి కళా వెంకటరావు (బీసీ), కోళ్ల లలిత కుమారి (బీసీ), బేబీ నాయన (వెలమ రాజు), విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు (కాపు), చింతకాయల అయ్యన్న పాత్రుడు (బీసీ), పల్లా శ్రీనివాసరావు (బీసీ), తూర్పు గోదావరి నుంచి యనమల రామకృష్ణుడు (బీసీ), జ్వోతుల నెహ్రూ (కాపు), నిమ్మకాయల చినరాజప్ప (కాపు), గోరంట్ల బుచ్చయ్యచౌదరి (కమ్మ), బుచ్చిరాజు (క్షత్రియ), పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యన్నారాయణ (బీసీ), కృష్ణా నుంచి బోండా ఉమామహేశ్వరరావు (కాపు), గద్దె రామ్మోహన్‌రావు (కమ్మ), గుంటూరు నుంచి నక్కా ఆనందబాబు (ఎస్సీ), పత్తిపాటి పుల్లారావు (కమ్మ), దూళ్లపాళ్ల నరేంద్ర (కమ్మ), నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (రెడ్డి), అనంతపుర నుంచి పరిటాల సునీత (కమ్మ), కాలువ శ్రీనివాస్ (బీసీ), చిత్తూరు నుంచి అమర్‌నాథ్ రెడ్డి (రెడ్డి), నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి (రెడ్డి), కర్నూల్ నుంచి భూమా అఖిల ప్రియా రెడ్డి (రెడ్డి) తదితరులు ఉన్నారు.
వీరిలో గతంలో మంత్రులుగా చేసిన వారు ఉన్నారు. అలాగే ఐదు, ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.
జనసేనలో ఇలా….
జనసేన కూడా సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు. విశాఖపట్నం జిల్లాలో కొణతాల రామకృష్ణ (బీసీ), పశ్చిమ గోదావరి నుంచి బొలిశెట్టి శ్రీనివాసరావు (కాపు) ఉన్నారు. వీరిలో కొణతాల రామకృష్ణ గతంలో మంత్రిగా చేశారు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా సీనియర్ నేతగా ఉన్నారు. వీరిద్దరికీ మంత్రి పదవులు దక్కలేదు.
బీజేపీలో కూడా సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు. విశాఖపట్నం నుంచి విష్టు కుమార్ రాజు (క్షత్రియ), పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కామినేని శ్రీనివాస్ (కమ్మ), కృష్ణా జిల్లా నుంచి సుజనా చౌదరి (కమ్మ)లకు మంత్రి పదవులు దక్కలేదు. ఇందులో కామినేని శ్రీనివాస్ గతంలో రాష్ట్ర మంత్రిగానూ, సుజనా చౌదరి గతంలో కేంద్ర సహాయ మంత్రిగానూ పని చేశారు. విష్ణు కుమార్ రాజు బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు.
టీడీపీ నుంచి మంత్రులు
టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి ), నారా లోకేష్ (కమ్మ), కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ), కొల్లు రవీంద్ర (బీసీ), పి.నారాయణ (కాపు), వంగలపూడి అనిత (ఎస్సీ), నిమ్మల రామానాయుడు (కమ్మ), ఎన్ఎండీ ఫరూక్ (ముస్లీం), ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి), పయ్యావుల కేశవ్ (కమ్మ), అనగాని సత్యప్రసాద్ (బీసీ), కొలుసు పార్థసారధి (బీసీ), డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ), గొట్టిపాటి రవి (కమ్మ), గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ), బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి), టీజీ భరత్ (వైశ్య), ఎస్.సవిత (బీసీ), వాసంశెట్టి సుభాష్ (బీసీ), కొండపల్లి శ్రీనివాస్ (బీసీ), మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రెడ్డి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
టీడీపీలో సామాజిక కూర్పు చూస్తే 21 మందిలో ఐదుగురు కమ్మ, ఒకరు కాపు, ఒకరు వైశ్య, ఒకరు ఎస్టీ, ఒకరు మైనార్టీ, ఇద్దరు ఎస్సీ, ముగ్గురు రెడ్డి, ఏడుగురు బీసీ సామాజికవర్గాలకు చెందిన వారు.
జనసేన నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు), నాదెండ్ల మనోహర్ (కమ్మ), కందుల దుర్గేష్ (కాపు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో ఇద్దరు కాపు, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.
బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ (బీసీ) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీలో సామాజిక కూర్పు చూస్తే, మంత్రి అయిన ఒక్కరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు.