Social Media Politics : రాజకీయ పార్టీల చేతిలో సోషల్ మీడియా అస్త్రం, ప్రత్యర్థులను పరిగెట్టిస్తున్న పోస్టులు
Social Media Politics : డిటిజల్ యుగంలో ఆన్ లైన్ మోడ్ సౌలభ్యంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజకీయాలు సైతం ఆన్ లైన్ అంటే సోషల్ మీడియా బాట పడుతున్నాయి. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయ పార్టీల సోషల్ మీడియాను ఒక అస్త్రంలా వాడుతున్నాయి.
ఒకప్పుడు రాజకీయాలంటే మైకుల మందు గంటల కొద్దీ వాదనలు, టీవీ డిబెట్లు. ఇప్పుడు పాలిటిక్స్ మోడ్ మార్చాయి. డిజిటల్ యుగంలో పాలిటిక్స్ సోషల్ మీడియా మార్గాన్ని ఎంచుకున్నాయి. సాంకేతికత అభివృద్ధితో సార్మ్ ఫోన్ నేటి ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. ఏది కావాలన్న క్షణాల్లో మన ముందుకు తెస్తుంది. సార్మ్ ఫోన్ల వాడకం పెరగడం, సోషల్ మీడియా విస్తరణతో పాలిటిక్స్ రూటు మార్చాయి. సోషల్ మీడియా రాజకీయాలకు తెరలేపాయి. ఇందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నాయి. తమ మద్దతుదారులతో సోషల్ మీడియా బృందాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ప్రజలకు తెలిసేలా చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన...ఇప్పటికే సోషల్ మీడియాలో బలంగా ఉన్నాయి. విషయం ఏదైనా క్షణాల్లో వైరల్ చేయగల ప్రత్యేకగా ఈ పార్టీలకు, వీరి మద్దతుదారులకు ఉంది. గ్రామాల నుంచి దేశ రాజధాని వరకు పార్టీ పరంగా జరిగే కార్యక్రమాల నుంచి అధికార పార్టీలను ఇరకాటంలో నెట్టే సమాచారం వరకు క్షణాల్లో వైరల్ చేస్తుంటాయి. తాము ఎంచుకున్న అంశాన్ని దేశవ్యాప్తంగా ట్రేడింగ్ లోకి తీసుకువస్తుంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల జరిగిన తెలుగు రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత పరిస్థితులు.
ఇటీవల ఎన్నికలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. విషయం ఏదైనా తమకు అనుకూలంగా మార్చుకుని క్షణాల్లో పోస్టులను వైరల్ చేస్తూ... ప్రజలను మభ్యపెట్టడంలో సోషల్ మీడియాకు ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సోషల్ మీడియా పాలిటిక్స్ జోరుగా సాగించాయి. అయితే ఈ విషయంలో కాస్త వెనుక బడిన బీఆర్ఎస్... ఎన్నికల్లో పరాజయాన్ని చూసింది. కాంగ్రెస్ హామీలు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి చేర్చి హస్తం పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇదే ఫార్మూలను వాడుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి అదే సోషల్ మీడియాతో.... కాంగ్రెస్ ను ముప్పుతిప్పలు పెడుతోంది బీఆర్ఎస్. చిన్నపాటి నిరసన నుంచి అరెస్టులు, ఆందోళన, అధికార కాంగ్రెస్ చర్యలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇలా ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా పాలిటిక్స్ చేస్తుంది.
సోషల్ మీడియా వింగ్స్
ఇక ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనకు స్ట్రాంగ్ సోషల్ మీడియా వింగ్స్ ఉండడంతో...వీటి మధ్య ఏ విషయమైన హోరాహోరీగా ఉంటుంది. ఏ విషయానైనా రాజకీయంగా ముడిపెడుతూ...లబ్దిపొందేందుకు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా పాలిట్రిక్స్ చేస్తు్న్నాయని నిపుణులు అంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, పోస్టులు పూర్తిగా నమ్మే ప్రసక్తి లేదంటున్నారు. రాజకీయ పార్టీల మద్దతుదారులు తమకు అవసరమైన కొద్ది సమాచారాన్ని మాత్రమే ట్రిమ్ చేసి వీడియోలు పోస్టు చేస్తుంటాయని అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తరించడంతో...ప్రజలను మభ్యపెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు. అందుకే రాజకీయ పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రాజకీయాలు సార్ట్ చేశాయని, ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియా పోస్టులు ఓట్లు రాలుస్తాయా? అంటే ఒకింత ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం