Special Trains: విశాఖపట్నం - సికింద్రాబాద్, విశాఖపట్నం- తిరుపతి, న్యూ టిన్సుకియా (అస్సాం) – ఎస్ఎంవీ బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్ల సేవలను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఈ మూడు మార్గాల్లో వారానికో ప్రత్యేక రైళ్లను కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తం ఆరు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం స్పెషల్ రైలు
ప్రతి బుధవారం విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ (08579 )రైలును అందుబాటులోకి తెచ్చింది. 2024 జూలై 3 (బుధవారం) నుండి 2024 ఆగస్టు 28 వరకు విశాఖపట్నం నుండి సికింద్రాబాద్‌కు వారానికి ఒకసారి ఈ ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7ః00 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మొత్త తొమ్మిది వారాలు పాటు అందుబాటులో ఉంటుంది.
ప్రతి గురువారం తిరిగి సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ (08580) రైలును అందుబాటులోకి తెచ్చింది. 2024 జూలై 4 (గురువారం) నుండి 2024 ఆగస్టు 29 వరకు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నానికి వారానికి ఒకసారి ఈ ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 7ః40 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ రైలు కూడా మొత్త తొమ్మిది వారాలు పాటు అందుబాటులో ఉంటుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి.
ప్రతి సోమవారం విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ (08583 )రైలును అందుబాటులోకి తెచ్చింది. 2024 జూలై 1 (సోమవారం) నుండి 2024 ఆగస్టు 26 వరకు విశాఖపట్నం నుండి తిరుపతికి వారానికి ఒకసారి ఈ ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7ః00 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9ః15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు మొత్త తొమ్మిది వారాలు పాటు అందుబాటులో ఉంటుంది.
ప్రతి మంగళవారం తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ (08584 )రైలును అందుబాటులోకి తెచ్చింది. 2024 జూలై 2 (మంగళవారం) నుండి 2024 ఆగస్టు 27 వరకు తిరుపతి నుండి విశాఖపట్నానికి వారానికి ఒకసారి ఈ ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 9ః55 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10ః15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు మొత్త తొమ్మిది వారాలు పాటు అందుబాటులో ఉంటుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం-తిరుపతి మధ్య దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
న్యూ టిన్సుకియా (అస్సాం) – ఎస్ఎంవీ బెంగళూరు - న్యూ టిన్సుకియా స్పెషల్ రైలు
ప్రతి గురువారం న్యూ టిన్సుకియా (అస్సాం)- ఎస్ఎంవీ బెంగళూరు (05952) ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. 2024 జూలై 4 నుండి 2024 అక్టోబర్ 31 వరకు న్యూ టిన్సుకియా (అస్సాం) నుండి ఎస్ఎంవీటీ బెంగళూరుకి వారానికి ఒకసారి ఈ ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. ఈ రైలు న్యూ టిన్సుకియా (అస్సాం)లో రాత్రి 6ః45 గంటలకు బయలుదేరుతుంది. మూడో రోజు మధ్యాహ్నం 1ః50కి విశాఖపట్నం చేరుకుని, మధ్యాహ్నం 2ః10 గంటలకు బయలుదేరి, ఎస్ఎంవీ బెంగళూరు ఉదయం 9ః00 లకు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 18 వారాల పాటు అందుబాటులో ఉంటుంది.
ప్రతి సోమవారం ఎస్ఎంవీ బెంగళూరు-న్యూ టిన్సుకియా (అస్సాం) (05951) ప్రత్యేక రైలు ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. 2024 జూలై 8 నుండి 2024 నవంబర్ 4 వరకు వారానికి ఒకసారి ఈ ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. రైలు ఎస్ఎంవీ బెంగళూరులో 00:30 గంటలకు (ఆదివారాలు అర్ధరాత్రి) బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 9ః40 విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 10ః00 గంటలకు బయలు దేరి, బుధవారం మధ్యాహ్నం 1:15 గంటలకు న్యూ టిన్సుకియా(అస్సాం) చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 18 వారాల పాటు అందుబాటులో ఉంటుంది.
ఈ రెండు రైళ్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ రైల్వే స్టేషన్‌లో ఆపుతారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు.
(జగదీశ్వరరావు జరజాపు,హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)