Prakasam District : ప్రకాశం జిల్లాలో విషాదం - బీచ్‌లో ఆరుగురు గల్లంతు, ముగ్గురు మృతి..!-six people drowned in the sea in prakasam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Prakasam District : ప్రకాశం జిల్లాలో విషాదం - బీచ్‌లో ఆరుగురు గల్లంతు, ముగ్గురు మృతి..!

Prakasam District : ప్రకాశం జిల్లాలో విషాదం - బీచ్‌లో ఆరుగురు గల్లంతు, ముగ్గురు మృతి..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 16, 2025 04:26 PM IST

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాకాల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రకాశం జిల్లాలో విషాదం
ప్రకాశం జిల్లాలో విషాదం (image source unsplash.com)

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాకల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

yearly horoscope entry point
Whats_app_banner