Singer Mangli : SVBC సలహాదారుగా మంగ్లీ.. ఎందుకింత సీక్రెట్ గా ఉంచారు?-singer mangli appointed as ttd svbc channel advisor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Singer Mangli Appointed As Ttd Svbc Channel Advisor

Singer Mangli : SVBC సలహాదారుగా మంగ్లీ.. ఎందుకింత సీక్రెట్ గా ఉంచారు?

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 05:37 PM IST

SVBC Advisor : సింగర్ మంగ్లీకి ఏపీ ప్రభుత్వం పదవి ఇచ్చింది. చాలా తక్కువ వయసులోనే ఎస్వీబీసీ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు మంగ్లీ. ఈ పదవిలో రెండేళ్లు ఉండనున్నారు. ఎప్పుడో ఉత్తర్వులు వచ్చినా.. ఈ విషయం బయటకు రాలేదు.

మంగ్లీ
మంగ్లీ (Instagram)

ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవి ఇచ్చింది. తనదైన పాటాలతో ఆకట్టుకుంటున్న మంగ్లీ ఇప్పుడు ఎస్వీబీసీ(SVBC) సలహాదారుగా నియమితులయ్యారు. టీటీడీ(TTD)కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా రెండేళ్ల పాటు ఉండనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి సంబంధించి.. మార్చిలోనే ఉత్తర్వులు వచ్చాయి. నాలుగు రోజుల క్రితం ఆమె బాధ్యతలు స్వీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

మార్చి 29న సత్యవతి అలియాస్ మంగ్లీని ఎస్వీబీసీ(SVBC) సలహాదారుగా నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులు బయటకు వచ్చాయి. ఈ పదవితో ఆమెకు నెలకు రూ.లక్ష వరకూ చెల్లిస్తారు. మంగ్లీ తిరుపతి(Tirupati)కి వచ్చినప్పుడల్లా.. వాహన, వసతి సౌకర్యాలు ఉంటాయి. ప్రయారిటీ బ్రేక్ దర్శనం కూడా ఉంటుంది. ఎస్వీబీసీకి ఆమె సేవలు అవసరమైనప్పుడల్లా వినియోగించుకుంటారు.

అయితే ఈ విషయంపై మాత్రం.. ప్రభుత్వం(Govt), ఎస్వీబీసీ, మంగ్లీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మంగ్లీ కూడా ఈ విషయంపై ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ఎస్వీబీసీ లాంటి ఛానల్ సలహాదారుగా నియమించి.. ఎందుకు సీక్రెట్ ఉంచారని ప్రశ్నలు వస్తున్నాయి. నవంబర్ 17న ఆమె తిరుమల(Tirumala) దర్శనానికి వెళ్లారు. అక్కడే రెండు రోజులు ఉన్నారు. అదే సమయంలో బాధ్యతలు స్వీకరించి ఉంటారని చర్చ నడుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటిస్తే.. తప్పు ఏంటని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జీవో మార్చిలో విడుదలైతే.. అప్పటి నుంచి ఇంకా బాధ్యతలు ఎందుకు తీసుకోలేదని పలువురు అడుగుతున్నారు.

మంగ్లీ పాటలు ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. తెలంగాణ(Telangana) యాసలో ఆమె పాడిన పాటలకు చాలా క్రేజ్ ఉంది. బతుకమ్మ పాటలు(Bathukamma Songs) కూడా పాడారు. కిందటి ఎన్నికల సమయంలో వైసీపీ(YSRCP) ప్రచార పాటలు కూడా పాడారు. ఆమె పాడిన జగనన్న అనే పాట ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది.

మంగ్లీ మెుదటి నుంచి కష్టపడి పైకి వచ్చారు. తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్(Tollywood)తో పాటుగా కన్నడ పాటలు కూడా పాడుతున్నారు. లక్షలమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎస్వీబీసీ సలహాదారుగా రాణించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ మంగ్లీకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఎస్వీబీసీ
ఎస్వీబీసీ
IPL_Entry_Point