Tirumala Brahmotsavam : సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
simha vahana seva at tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
(1 / 4)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు సింహ వాహనంపై దర్శనమిచ్చారు.(HT)
(2 / 4)
బుధవారం ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ ప్రారంభమైంది. తిరువీధుల్లో వివాహారించిన స్వామివారిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు.(HT)
(3 / 4)
నిద్రలేవగానే దర్శించే వాటిలో అతి ముఖ్యమైంది సింహదర్శనం. సింహవాహనం దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ముందుకు సాగి సర్వత్రా విజయం సాధించి ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.(HT)
(4 / 4)
శ్రీవారి సింహవాహన సేవ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గురువారం రాత్రి త్యపుపందిరి వాహన సేవ నిర్వహిస్తారు. ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి సమయం అనుకూలం. అందుకే స్వామివారికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే సంప్రదాయన్ని నిర్వహిస్తారు.(HT)
ఇతర గ్యాలరీలు