CBN Arrest Case : స్కిల్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదు, ఆరోపణలు అన్నీ బోగస్ - సీమెన్స్ కంపెనీ మాజీ MD ప్రకటన-siemens md suman bose statement about skill development case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Siemens Md Suman Bose Statement About Skill Development Case

CBN Arrest Case : స్కిల్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదు, ఆరోపణలు అన్నీ బోగస్ - సీమెన్స్ కంపెనీ మాజీ MD ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 17, 2023 01:17 PM IST

Skill Development Case Updates: స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి జరగలేదని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టం చేశారు. అన్నీ అధ్యయనం చేశాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించామని చెప్పారు. సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్ అని వ్యాఖ్యానించారు.

మెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్
మెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్

Skill Development Case Updates: సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసు నిరాధారమైందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే మా ప్రాజెక్టు లక్ష్యంగా ఉందన్నారు . 2014లో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని… దేశంలో 200కు పైగా ల్యాబ్‍లను ప్రారంభించామని చెప్పుకొచ్చారు. సీమెన్స్ కంపెనీ, ఏపీఎస్‍ఎస్‍డీసీ మధ్య ఒప్పందం ఉందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఒక సాప్ట్ వేర్‍పై యువతకు అవగాహన కల్పిస్తే దానికి డిమాండ్ పెరుగుతుంది. మార్కెటింగ్ భాగంగానే 90:10 ఒప్పందం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2.32 మందికి సర్టిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు చేస్తున్నారు. లక్ష బిల్ట్ ఆపరేటర్- ట్రాన్స్ ఫర్ ఆపరేట్ పద్దతిలో ఈ ప్రాజెక్టు నడిచింది. 2021లో ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేశాం. ప్రాజెక్టు విజయవంతమైందని ఏపీఎస్‍ఎస్‍డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారు. 2018లోనే ఈ ప్రాజెక్టు నుంచి నేను బయటకు వెళ్లిపోయాను . 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీఎస్‍ఎస్‍డీసీలో ఏం జరిగిందో నాకు తెలియదు. గతంలో మెచ్చుకున్న ఏపీఎస్‍ఎస్‍డీసీనే ఈ ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించింది. శిక్షణ కేంద్రాలు చూడకుండానే అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఒక్క కేంద్రం సందర్శించలేదు.. ఒక్క తనిఖీ జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ. ఒక హత్య జరిగిందని విచారణ చేయాలంటున్నారు. విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు . నాపై, ఇతరులపై తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారు" అని సుమన్ బోస్ చెప్పారు.

స్కిల్ డెవలప్‍మెంట్.. చాలా విజయవంతమైన ప్రాజెక్టు అని అన్నారు సుమన్ బోస్. “2016లో కేంద్రం విజయవంతమైన నమూనాగా ప్రకటించింది. ప్రాజెక్టు అందించిన అంతిమ ఫలితాలు చూసి మాట్లాడాలి. స్కిల్ డెవలప్‍మెంట్ ఫలితాలు మన కళ్ల ముందే ఉన్నాయి. స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టు నూరు శాతం విజయవంతమైంది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి జరగలేదు. అన్నీ అధ్యయనం చేశాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించాం. ప్రాజెక్టులో అధిక భాగం సీమెన్స్ అధిక భాగం సీమెన్స్ నుంచి డిస్కౌంట్స్ రూపంలో అందింది. డిస్కౌంట్స్ లో అవినీతి సాధ్యమని ఎలా చెబుతారు? సీమెన్స్ తో ఒప్పందం జరగలేదనడం పూర్తి అబద్దం. ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఏపీ స్కిల్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా? ఏలాంటి మనీలాండరింగ్ జరగలేదు. కోర్టుల పరిధిలో ఉన్నందున కోర్టులకు అన్ని విషయాలు చెబుతాం. ముగ్గురి మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం . సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్. ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. చేస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.

“కియా మోటర్స్ మానవ వనరులకు పూర్తి శిక్షణ ఇచ్చాం. గొప్పగా శిక్షణ ఇవ్వడంపై కియా సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ,10 కోట్లే సీమెన్స్ కు వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న మొత్తం డిజైన్ టెక్ సంస్థ ఖాతాకు వెళ్లింది. డిజైన్ టెక్ సంస్థ అందరికీ నిధులు విడుదల చేసింది. సీమెన్స్ లో ప్రాజెక్టు అప్రూవల్‍కు అన్ని పత్రాలు ఉన్నాయి. తేదీల్లో మార్పులున్నాయి అనడంలో వాస్తవాలు లేవు. అందరం ఒకేసారి ఒప్పందంపై సంతకాలు చేశాం. ఆరోజు విద్యుత్ పోతే.. కొవ్వొతులు పెట్టుకుని చేశాం. ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇలాంటి ఆరోపణలు పలువురి జీవితాలపై ప్రభావం చూపుతాయి” అని బోస్ తెలిపారు.

WhatsApp channel