SI Suicide : తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్-si committed suicide by firing a gun in tanuku rural police station ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Si Suicide : తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్

SI Suicide : తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్

SI Suicide in Tanuku Rural Police Station : పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన తణుకు పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఇటీవల సస్పెండ్‌ అయిన కారణంగానే ఎస్ఐ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్ఐ ఏజీఎస్ మూర్తి

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. సర్వీస్ రివ్వాలర్ తో కాల్చుకోవచంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐ ఏజీఎస్ మూర్తి సస్పెన్షన్ కు గురయ్యారు.

ప్రస్తుతం వీఆర్ లో ఉన్న ఎస్సై ఏజీఎస్ మూర్తి… ఇవాళ ఉదయం పెనుగొండలో ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తణుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ క్రమంలోనే వాష్ రూమ్ లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సైని సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు మూర్తి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎస్సై సూసైడ్ ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఎస్సై సూసైడ్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనం